'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్.. హెబ్బా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో తాజాగా అందరూ యువతరం క్రేజీ భామ హెబ్బా పటేల్ గురించే చర్చించుకుంటున్నారు. పరిశ్రమకు చెందిన పెద్దలే కాదు, నవతరం తారలు కూడా ఈ అమ్మడి గురించే గుసగుసలాడుకుంటున్నారు.ఇంతకీ ఆ గుసగుసలేమిటనేగా మీ డౌటు? వెండితెర భామలపై ఇలాంటివి మామూలే కదా? అనుకుంటున్నారు కదూ? అవును మరి. అవి మామూలివే అయినా కాస్త శృతిమించితే పెద్ద తలనొప్పే మరి! ఇంతకీ అసలు విషయానికొద్దాం... యువ హీరో రాజ్‌తరుణ్‌కు జోడీగా హెబ్బా ఇప్పటికే మూడు చిత్రాలు చేసింది. ఆ చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కటి పేరు తెచ్చుకున్నాయి. ఈ చిత్రాల్లో ఇద్దరి జోడీ బాగా కుదిరిందని కూడా టాక్ వినిపించింది. అది సరే..కానీ ఇలాంటి వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ‘అంధగాడు’ చిత్రం మీడియా సమావేశంలో కూడా హెబ్బాకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఇక లాభం లేదనుకున్నా ఈ బ్యూటీ ఆసక్తికరమైన సమాధానం చెప్పేసింది. ఇంతకీ ఏం చెప్పిందనేగా..‘‘రాజ్‌తరుణ్‌తో తొలిసారి ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంలో నటించాను. అప్పుడు రాజ్ చాలా హైపర్‌గా ఉండేవాడు. ఇప్పుడు అతడిలో చాలా మార్పు వచ్చింది. చాలా సైలెంట్ అయిపోయాడు. ఇప్పటికే రాజ్‌తో మూపు సినిమాలు చేశాను ఇక చాలు. ఇక అతడితో నటించడమంటే నాకు బోర్. ఇప్పట్లో రాజ్‌తో ఇంకో సినిమా చేయలేదు. మూడు చిత్రాలకే మా మధ్య ఎఫైర్ ఉందంటూ రూమర్స్ సృష్టించారు. ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్లు రాసేసుకుంటున్నారు. మరో సినిమా చేస్తే ఇంకేమైనా వుందా? పెళ్లి కూడా చేసేసుకున్నాం అంటూ రాస్తారు. వామ్మో..మీడియానా? మజాకా!? 2015 నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నాను. కాస్త విశ్రాంతి కోసం రెండు నెలలు సినిమాలను పక్కన పెట్టేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. నేను చేస్తున్న చిత్రాలను ఆదిరిస్తున్న ప్రేక్షకులకు, ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్న టాలీవుడ్‌కు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా’’అంది. దటీజ్..హెబ్బా!

-సమీర్