'క్లాప్' కొట్టు గురూ!

ఇక దక్షిణాదికి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది చిత్రాల్లో నటించడమంటే పరిణీతి చోప్రాకు మహా ఇష్టమట. అనుష్క, ఇలియానా, హన్సిక, తాప్సీ ఇలా చాలామంది ఉత్తరాది భామలు దక్షిణాదిలో అడుగుపెట్టి అందరి అభిమానాలను చూరగొన్న విషయం తెలిసిందే. అలా వారి దారిలో పరిణీతి చోప్రా కూడా చేరబోతోందిట. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, కత్రీనాకైఫ్ లాంటి అందాల సుందరాంగులు సైతం దక్షిణాది చిత్రాల్లో నటించి తమ ప్రతిభను చాటుకున్న తారలే కావడం గమనార్హం. పరిణీతిని ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ దక్షిణాదికి పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అగ్ర దర్శకుడు ఓ స్టార్ హీరోతో తమిళం, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో వున్నారట. ఇందులో పరిణీతి దాదాపు ఖరారైందని పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదీ..సంగతీ!!

-సమీర్