'క్లాప్' కొట్టు గురూ!

రీ ఎంట్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ‘రంగీలా’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన భామ ఊర్మిళా మతోండ్కర్ రీ ఎంట్రీకి సిద్ధమయిందట! అవును.. నిజంగా నిజం. 43ఏళ్ల వయస్సులో అదీ..ఐటమ్‌సాంగ్‌తోనట! ‘రంగీలా’ ఊర్మిళకు స్టార్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టడమే కాదు, కెరీర్‌ని కాపాడింది. అదే ఊపుతో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అంతేకాదు, ఆ చిత్రంతో ఆమె బాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా ప్రాచుర్యం పొందింది. నార్త్‌తో పాటు సౌత్‌లోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సుందరాంగి 2008లో విడుదలైన ‘కర్జ్’ చిత్రం తర్వాత చిత్రసీమకు దూరమైంది. అడపాదడపా టీవీ షోలతో పాటు మరాఠీ సినిమాల్లో అతిథి పాత్రల్లో నటిస్తున్న ఊర్మిళ త్వరలో ఓ బాలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందిట. అయితే చాలా మంది సీనియర్ తారలు తల్లి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇస్తుంటే ఈ అమ్మడు మాత్రం స్పెషల్ సాంగ్‌తో వస్తుండటం గమనార్హం. ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ‘రైతా’ చిత్రంలో ఈ సాంగ్‌కు సిద్ధమైంది. అభినయ్ డియో దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. ఈ విషయం గురించి కొంతమంది మీడియా ఊర్మిళను ప్రశ్నిస్తే చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి తప్పించుకుందిట. అదీ..సంగతీ!

సమీర్