'క్లాప్' కొట్టు గురూ!

బిజీ బిజీగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే మంచి పాపులారిటీ, అంతకంటే మంచి అవకాశాలు సొంతం చేసుకున్న అదృష్ణవంతురాలు అందాల భామ రాశీఖన్నా. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్‌టిఆర్, రవితేజ చిత్రాల్లో నటిస్తూ యమబిజీగా వుంది. మరికొన్ని చిత్రాలు అంగీకరించినవి వున్నాయి. గ్లామర్ లుక్స్‌తో ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకుంటున్న ఈ భామ ముఖ్యంగా యువతరం ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్‌ని సంపాదించుకుంది. ఎలా అనిపిస్తుంది కెరీర్ అని రాశీఖన్నాను కదిలిస్తే- ‘‘ఎంతో హ్యాపీగా వున్నా. తెలుగు చిత్రసీమ నాకు ఇస్తున్న ప్రోత్సాహం ఎప్పటికీ మరచిపోలేను. మంచి అవకాశాలను పొందేలా చేస్తున్న పరిశ్రమ పెద్దలకు నేనెంతో రుణపడివుంటా. అయితే గ్లామర్ గ్లామర్ అంటూ అంతా అంటున్నారు. ఏ వయసులో చేయాల్సిన పాత్రలు ఆ వయసులో చేయాలన్నదే నా ఆలోచన. అందుకే ఎక్కువగా నేను చేస్తున్న చిత్రాల్లో గ్లామర్ పాత్రలే వుంటున్నాయి. అలా అని నటనకు స్కోప్ లేదంటే నేను ఒప్పుకోను. పాత్ర పరిమితి మేరకే అలా కనిపిస్తున్నా. ప్రస్తుతం మంచి చిత్రాలు చేతిలో వున్నాయి. అవి విడుదలైతే మరింత ఇమేజ్ వస్తుంది. కెరీర్‌కు కూడా ఓ మైలురాయిలా వుంటుంది’’అని ఎంతో హ్యాపీగా చెప్పుకొచ్చింది రాశీఖన్నా! వాహ్..రాశీ..ఆల్ ది బెస్ట్!!

-సమీర్