'క్లాప్' కొట్టు గురూ!

విభిన్నకోణంలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో కథానాయికగా అనుష్కశర్మ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటూనే మరో అవతారం కూడా ఎత్తింది. అదే నిర్మాతగా. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తూ విజయం వైపే దూసుకెళుతోంది. నటనతో పాటు, నిర్మాతగా కూడా తన సత్తా చాటుకుంటుండడంతో ఇప్పుడు అందరి దృష్టి అనుష్కపైనే పడింది. నిర్మాతగా అడుగుపెడుతూనే ‘ఎన్ హెచ్ ఓ’తో తొలి విజయాన్ని అందుకుంది. అటు తర్వాత ‘్ఫలౌరి’లో ఆత్మగా నటించి అందర్నీ మెప్పించింది. ఇప్పుడు మూడో చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. అదే ‘పరి’. సొంత నిర్మాణ సంస్థలో నటిస్తూ నిర్మిస్తోంది. ఇటీవల ట్విట్టర్‌లో విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అదిరిపోయింది. ఇంత దాకా గ్లామర్ భామగా ప్రేక్షకులకు కనువిందు చేసిన ఈ అమ్మడు విభిన్న కోణంలో కనిపించి తన వెరైటీ లుక్స్‌తో అందరి దృష్టి తనవైపునకు తిప్పుకుంది. ఈ విషయం గురించి అనుష్క చెబుతూ- ‘‘నటిగా నాకు నచ్చిన సినిమాలు, ఇష్టమైన పాత్రలు చేసుకుంటున్న నాకు నిర్మాతగా కూడా మారాలనిపించింది. అందుకే ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తున్నా. ఈ రెండింటిలోనూ నాకు చాలా తృప్తి కలుగుతోంది. సొంత నిర్మాణ సంస్థలో మంచి సినిమాలు నిర్మించి ఎంతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా’’అంటూ సెలవిచ్చింది అందాలభామ అనుష్కశర్మ.

-సమీర్