'క్లాప్' కొట్టు గురూ!

అత్యాశలేమీ లేవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన ఆడిపాడిన అందాల భామ కాజల్ అగర్వాల్‌కు అత్యాశలేమీ లేవట! కాకపోతే కొన్ని చేయాలనుకుంటున్న డ్రీమ్‌రోల్స్ మాత్రం ఇంకా మిగిలే వున్నాయట. ప్రతీ ఒక్కరి జీవితంలో జయాపజయాలు సహజం. కానీ, వాటిని నిలదొక్కుకుని నిల్చున్నవారే కెరీర్‌లో పైకి వస్తారన్నది నిజం. చిత్రసీమకు అయితే ఇది సరిగ్గా సరిపోతుంది. నేడు వస్తున్న చాలా మంది కుర్ర హీరోయిన్లు ఐదారు చిత్రాలతోనే తమ కెరీర్‌కు ఫుల్‌స్ట్ఫా పడుతుంది. ఎంతో స్పీడుగా దూసుకొచ్చిన తారలు అంతే స్పీడుగా తెరమరుగైపోతున్నారు. కానీ బ్యూటీ కాజల్ అగర్వాల్ మాత్రం ఇప్పటికీ తన కెరీర్‌ను కాపాడుకుంటూనే వుంది. దాదాపు యాభై చిత్రాలు పూర్తి చేసింది. రానాతో చేస్తున్న ‘నేనే రా..నేనే మంత్రి’ చిత్రంతో కాజల్ అర్థశతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ గురించి చెప్పమంటే.. ఇలా చెప్పుకొచ్చింది- ‘‘నేను ఎప్పుడూ సంతోషంగానే వుంటాను. నా డ్రీమ్‌రోల్స్ కొన్ని ఇంకా మిగిలి వున్నాయి. అవి త్వరలోనే నెరవేరుతాయి చూస్తారుగా మీరే..’’. అవును..నిజమా!? నమ్మేద్దామా? ప్చ్..కాజల్!!

-సమీర్