'క్లాప్' కొట్టు గురూ!

గాడిలో పడ్డట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంత విరామం తర్వాత మళ్లీ నటి అమలాపాల్ కెరీర్ గాడిలో పడ్డట్టేనంటున్నారు చిత్రసీమకు చెందిన ఆమె సన్నిహితులు. పెళ్లికి ముందు.. ఆ తర్వాత ఆమె కెరీర్‌ని విశే్లషించుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. పెళ్లికి ముందు తక్కువ చిత్రాలే చేసినా అవి ఆమె కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ సమయంలో కెరీర్ కూడా మంచి ఊపులో సాగింది. ప్రతి హీరోయిన్‌లోనూ ఏదో ఒక స్పెషాలిటీ వుంటుంది. అలా అమలాపాల్‌లోనూ వుంది. అదే ఆమె గ్లామర్ రహస్యం. పెళ్లి.. విడాకులతో కొంచెం తడబడినా అమలా కెరీర్ ఇక గాడిలో పడ్డట్టేనంటున్నారు. రాబోయే చిత్రాలే ఈ విషయానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ధనుష్‌కు జోడీగా తమిళంలో నటించిన ‘విఐపి-2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంపై అమలాపాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌ని ఎక్కడికో తీసుకెళుతుందన్న గట్టి నమ్మకం అమలాలో వుంది. ‘తిరుట్టుప్పయలే-2’, ‘్భస్కర్ ఒరు రాస్కెల్’తో పాటు రెండు మలయాళ చిత్రాలు చేతిలో వున్నాయి. తాజాగా మరో రెండు తమిళ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కెరీర్ ఎలా వుంది అని అమలాపాల్‌ను కదిలిస్తే- ‘‘చాలా రోజుల తర్వాత ఎంతో హ్యాపీగా వున్నా. నా జీవితంలో ఎదురైన ఒడిదుడుకులకు దూరంగా మంచి జీవితాన్ని గడుపుతున్నా. కెరీర్‌లో మంచి చిత్రాలు నా ముందున్నాయి. ఇవి ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఆత్మ సంతృప్తి కలుగుతోంది. రాబోయే చిత్రాలు నా కెరీర్‌కు ఓ మైలురాయిలా నిలుస్తాయి’’అంటూ చెప్పుకొచ్చింది. వాహ్..అమలాపాల్ ఆల్ ది బెస్ట్!

-సమీర్