'క్లాప్' కొట్టు గురూ!

మరీ అంతనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను తమ చిత్రాల్లో తీసుకోవాలంటే నిర్మాతలు జడుసుకుంటున్నారట. అందుకు కారణం లేకపోలేదు. తను ఏదైనా చిత్రంలో నటించాలంటే భారీ పారితోషికం ఇచ్చుకోవలసిందేనంటూ దర్శక, నిర్మాతలకు షరతులు కూడా పెడుతోందట. ఆ పారితోషికం అంతా ఇంతా కాదు.. 12 కోట్లపై మాటేనట! మరీ అంత డిమాండా? అని నిర్మాతలు నోరెళ్లబెడుతున్నారట. దీపికా ఇంత హఠాత్తుగా రెమ్యూనరేషన్‌ని పెంచడానికి కారణం ఏమైవుంటుదనేగా మీ డౌటు! అక్కడికే వద్దాం.. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘పద్మావతి’ అనే చిత్రంలో దీపికా పదుకొనే నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఏకంగా రెండు వందల డేట్స్ ఇవ్వాల్సి వచ్చిందట. అందుకుగాను 12 కోట్లు తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఎన్నో చిత్రాలు వదులుకోవలసి వచ్చిందట. అందుకే ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు భారీ స్థాయిలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఈ అమ్మడి అత్యాశకు అంతేలేదనీ, అంత రెమ్యూనరేషన్ ఇచ్చే స్థితిలో ఏ నిర్మాతా ముందుకు రావడంలేదని అంటున్నారు. పారితోషికం విషయంలో దీపికా దిగిరాక తప్పదని కూడా అంటున్నారు. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి తన ప్రతిభను చాటుకుంటున్న ఈ భామ డిమాండ్‌కు నిర్మాతలే కాదు, పరిశ్రమ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయిందట. అదీ..సంగతీ!

-సమీర్