'క్లాప్' కొట్టు గురూ!

గ్లామరే రక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్‌కు గ్లామరే రక్షలా వుంది. అందుకే తన అంద చందాలతో గ్లామర్ పాత్రలవైపే దృష్టి సారిస్తోంది. వైవిధ్యమైన పాత్రల వైపు కనె్నత్తి కూడా చూడటం లేదు. దర్శక, నిర్మాతలు కూడా రకుల్‌ని గ్లామర్ పాత్రల్లో చూపించడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి పాత్రలు కెరీర్‌ని కాపాడలేవు అన్న విషయం రకుల్‌కు తెలియదా? అని అంటున్నారు ఆమె సన్నిహితులు. ఈ విషయం గురించి రకుల్‌ని అడిగితే- ‘‘నటన అన్నప్పుడు ఎప్పుడు ఎలాంటి పాత్రలు లభిస్తాయో తెలియదు. వచ్చిన వాటిలో మంచివి అనుకున్నవి చేస్తూ పోవడమే మనకు తెలిసిన దారి. అయినా గ్లామర్ అంటే నటన కాదా? నటనలో అదీ ఒక భాగమే కదా? అయినా ఏ వయసులో చేయాల్సిన పాత్రలు ఆ వయసులోనే చేయాలి. తర్వాత చేస్తామంటే చూడడానికి ఎవరూ రారు. నాకు లభిస్తున్న పాత్రల్లో నాకు ఇష్టమైనవే చేస్తున్నా. అందులో నాకు సంతృప్తి లభిస్తోంది. ఇక వైవిధ్యమంటారా? చూద్దాం.. ఆ పాత్రలు నాకు వెదుక్కుంటూ ఎప్పుడు వస్తాయో’’అంటూ ఎంతో తెలివిగా చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్‌సింగ్. వామ్మో..గడుసుపిండమే సుమా!

-సమీర్