'క్లాప్' కొట్టు గురూ!

హాట్ హాట్‌గా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ, బెంగాలీ భాషలతో పాటు ఒకటీ అరా తెలుగు సినిమాలు కూడా చేసిన రియాసేన్ తమిళంలోనూ మెరిసింది. ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆశయాలతో వెండితెరపై అడుగుపెట్టింది. పాతతరం గ్లామరస్ , హాట్ హాట్ నటీమణి మున్‌మున్ సేన్ కూతురైన రియాసేన్‌ను దక్షిణాది సినిమాల వాళ్లు కెరీర్‌లో నిలబెట్టడానికి గట్టిగానే ప్రయత్నించారు. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. గ్లామరస్ గానే నటించినా, రియాలో హీరోయిన్ ఫీచర్లను గుర్తించలేదు మన టాలీవుడ్ జనాలు. ఇక కొన్ని హిందీ, బెంగాలీ బోల్డ్ సినిమాల్లో అందాలు ఆరబోసింది రియా. ఇక ఒక సెట్స్ స్కాండల్ ఈమెను వార్తల్లో నిలిపింది. ప్రస్తుతానికి అయితే పూర్తిగా బెంగాలీ సినిమాలకు పరిమితం అయిపోయి, కొన్ని యూట్యూబ్ స్థాయి సినిమాల్లో నటిస్తోంది ఈ అమ్మడు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా మాత్రం రియా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రమ్‌లో ఓ హాట్ ఫోజ్‌ను పోస్టు చేసింది ఈ బెంగాలీ భామ. అమాయకంగా హాట్‌గా రియా ఇచ్చిన ఫోజును చూసి ‘వన్ మోర్..’అని అడుగుతున్నారట ఫ్యాన్స్. ఈ విషయం గురించి రియా చెబుతూ- ‘‘హీరోయిన్ అన్నాక అన్ని కోణాల్లో కనిపించాల్సిందే. ఏవో కొన్ని ఫోజులకే పరిమితం అయితే కెరీర్‌లో నిలదొక్కుకోలేం. అందుకే సోషల్ మీడియా కూడా ఇప్పుడు హాట్ హాటే! అందుకే అన్నీ చోట్లా నేనేంటో నిరూపించుకోదలిచాను’’అంటూ సెలవిచ్చింది. రియానా..మజాకా మరి!

సమీర్