'క్లాప్' కొట్టు గురూ!

లక్కీగాళ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవును.. నిజంగానే టాలీవుడ్‌లో లక్కీగాళ్ ఎవరంటే అంతా అనుపమ పరమేశ్వరన్ పేరే చెబుతున్నారు. ఎందుకు ఇలా అంతా ఈ అమ్మడి గురించే చెబుతున్నారెందుకు? అని అనుకుంటున్నారు కదూ..! అతి తక్కువ కాలంలో క్రేజీ హీరోలతో జోడీకట్టి నటనలో తన స్టయిల్ ఏంటో ఇట్టే టాలీవుడ్‌కు రుచి చూపించింది. దర్శక, నిర్మాతలు ఎలాంటి పాత్రలో నటించమంటే ఆ పాత్రలో ఒదిగిపోయే హావభావాలు.. అందుకుతగ్గ నటనాచాతుర్యం చూపించడంలో అనుపమ ది బెస్ట్ అని అంటుంటారు. అనడమే కాదు, ఆమె చిత్రాలు చూసిన వారెవరైనా ఇది నూటికి నూరుపాళ్లు నిజమని కూడా ఒప్పేసుకుంటారు. ఇంత తక్కువ కాలంలో ఇంతటి క్రేజ్‌ని సంపాదించుకున్న అనుపమని కెరీర్‌పై ఎలా ఫీలవుతున్నారు అని కదిలిస్తే- ‘‘లక్కీగాళ్.. లక్కీగాళ్... అని అంటున్నారంటే అది నా గొప్పతనం కాదు. టాలీవుడ్ ప్రేక్షకులది. నాకు మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న దర్శకులు, నిర్మాతలది. నా చిత్రాలు, నా పాత్రలను ఆదరిస్తున్న ప్రేక్షకులది. నటనకు స్కోప్ వున్న పాత్రలపైనే దృష్టి సారించడం వల్ల నా క్యారెక్టర్స్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ని తెచ్చిపెడుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం నా డైరీ ఖాళీ లేకుండానే వుంటోంది అంటే అది నిజంగానే నేను లక్కీగాళ్‌నే’’అంటూ ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చింది. దటీజ్..అనుపమ!

-సమీర్