'క్లాప్' కొట్టు గురూ!

రత్తాలు.. రత్తాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో ‘రత్తాలు.. రత్తాలు...’ అంటూ ఆయన అభిమానులనే కాదు, టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన భామ రాయ్‌లక్ష్మీ ఈ మధ్య ఎక్కడా.. కనిపించడం లేదేంటబ్బా అని అంతా అనుకుంటున్న సమయంలో ఇదిగో.. నేనున్నానంటూ మరోసారి సీన్‌లోకి ఎంటరయింది. సెల్ఫ్ పబ్లిసిటీ అంటే ఈ రత్తాలుకు మహా ఇష్టం. అలా తనకు తానే సొంత డబ్బా కొట్టుకుంటూ ఎప్పుడూ వార్తల్లోనే వుండే ప్రయత్నం చేస్తుంటుంది. ఓ బాలీవుడ్ మూవీ ఛాన్స్ వల్ల మంచి అవకాశం కోల్పోయానని చెప్పుకొచ్చింది రాయ్‌లక్ష్మీ. ఇటీవల మలయాళంలో సూపర్‌స్టార్ మమ్ముట్టితో రొమాన్స్ చేసే అవకాశాన్ని జారవిడుచుకుందట. అందుకు కారణం బరువు పెరగడమేనట. తాజాగా హిందీలో ‘జూలీ-2’ చిత్రంలో నటిస్తోంది రాయ్. ఇందులో ఈ అమ్మడిది కీలకపాత్ర. ఈ క్యారెక్టర్ కోసం ఏడాదిన్నరపాటు ఎంతగానో శ్రమించిందట. దాదాపు 11 కిలోల బరువు కూడా తగ్గిందట. ఆపై ఏడు కిలోల బరువు పెరగాల్సి వచ్చిందట. అలా బరువు పెరగడం, తగ్గడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురైందట. దీంతో ఎన్నో అవకాశాలు వదులుకున్నానని చెబుతోంది రాయ్. మమ్ముట్టికి జోడీగా నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం ఆమెను బాగా కుంగదీసిందట. ఇకపై కెరీర్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలనుకుంటోదిట. ‘జూలీ-2’ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదలయ్యాక రాయ్‌ని ప్రేక్షకులు కొత్త కోణంలో చూస్తారని కూడా చెప్పుకొచ్చింది. ఆల్ ది బెస్ట్ రాయ్!

-సమీర్