'క్లాప్' కొట్టు గురూ!

అమ్మో..అను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న నటి అను ఇమ్మానుయేల్ తాజాగా మరో అడుగు ముందుకేసి మలయాళంలో కూడా అడుగుపెట్టింది. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రం ‘తుప్పరివాలన్’. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా అన్ని భాషల్లో చేస్తున్నారుగా ఇబ్బందిగా లేదా? అని అనుని కదిలిస్తే- ‘‘నటన ఎక్కడైనా ఒక్కటే. అది తెలుగా, మలయాళమా, తమిళమా? అన్నది నేను పట్టించుకోను. నాకు కావలసింది నా పాత్ర. నేను చేయబోయే చిత్రం. అది ప్రేక్షకులకు ఏ విధంగా దగ్గరవుతుంది అన్నదే ఆలోచిస్తా. ముఖ్యంగా నా తాజా చిత్రం ‘తుప్పరివాలన్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిష్కిన్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందని తెలియగానే పలువురు పలు రకాలుగా మాట్లాడారు. ఆయన షార్ట్‌టెంపర్ అని భయపెట్టారు కూడా. అయితే మిష్కిన్ దర్శకత్వంలో నటిస్తున్నప్పుడు ఆయన గురించి అందరూ ఎందుకలా అనుకుంటున్నారో నాకు మాత్రం అర్థం కాలేదు. మిష్కిన్ దర్శకత్వ శైలి ప్రత్యేకంగా వుంటుంది అని మాత్రం చెప్పగలను. ‘తుప్పరివాలన్’ చిత్రంలో నటించడానికి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా రమ్మని దర్శకుడు మిష్కిన్ చెప్పారు. ఎందుకంటే చిత్రంలోని కథానాయికను ఎలా మలుచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. నేనూ అదే కోరుకోవడంతో మిష్కిన్ చెప్పినట్లు నటించాను. ఆ సమయంలో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ చిత్రంలో నేను పిక్ పాకెటర్‌గా కనిపిస్తా. అందుకు దొంగతనం ఎలా చేయాలన్నది కూడా నేర్చుకున్నా. ఇంకా హీరో విశాల్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభవం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి ఎన్నో కొత్త విషయాలు.. కొత్త అనుభూతులు ఎన్నో.. ఎనె్నన్నో ఉంటాయి’’ అంటూ ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది అను. అమ్మో..అను గడుసుపిండమే సుమా!

-సమీర్