'క్లాప్' కొట్టు గురూ!

అరుదైన అవకాశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఎగురవేయడం అరుదైన అవకాశం కాక మరేంటి? అవును..ఇది నిజంగా నిజం! ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ వేడుకల్లో ఐశ్వర్యకు ఈ అరుదైన అవకాశం లభించబోతోంది. ప్రతి ఏడాది ఆగస్టులో ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా.. కన్నుల పండువగా జరిగే ఈ వేడుకల్లో ఐశ్వర్యకు ఈ ఏడు ఈ అపురూప అవకాశం దక్కింది. ఇప్పటి వరకు ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో రెడ్ కార్పెట్‌పై హొయలొలికించిన ఈ మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ బ్యూటీకి తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐ.ఎఫ్.ఎఫ్.ఎమ్) వేడుకల్లో సందడి చేసే అవకాశం రావడంతో ఐశ్వర్య ఎగిరిగంతేసింత పని చేసిందట! ఫ్రాన్స్‌లో జరిగే ‘కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ వంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్స్‌లో పాల్గొన్న ఈ బ్యూటీకి ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్‌లో పాల్గొనడం అరుదైన అవకాశమేంటి? అని కొందరికి డౌట్ రావొచ్చు. కానీ.. నిజంగా ఇది ఐశ్వర్యకు అరుదైన అవకాశమే అంటున్నారు బాలీవుడ్ బాబులు. వారి మాటల్లో నిజం లేకపోలేదు. మెల్‌బోర్న్‌లో ఇండియా జాతీయ జెండా ఎగురవేసిన తొలి భారతీయ మహిళ ఐశ్వర్యారాయ్ కావడం విశేషం. ఇంత వరకూ ఏ నటికి రాని అవకాశం ఈ సుందరాంగికి రావడం అరుదైనది కాదంటారా!? వాహ్..ఐశ్యర్య!!

-సమీర్