'క్లాప్' కొట్టు గురూ!

వైవిధ్యమే బాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో చక్కటి పాత్రలతో అందర్నీ అలరిస్తున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠికి ఇక వైవిధ్యమే బాటలా కనిపిస్తుంది. గ్లామర్.. గ్లామర్ అంటూ తెగ ఇదైపోతున్న కథానాయికలంతా లావణ్యను చూసి నేర్చుకోవాలంటున్నారు. చేసే చిత్రాలు.. వేసే క్యారెక్టర్స్ వేటికవే భిన్నంగా ఉండేలా చూసుకుంటూ కెరీర్‌లో రివ్వున దూసుకెళ్లే తారామణులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఆ లెక్కలో లావణ్యకూ కాస్తంత చోటుంది. చేయబోయే చిత్రంలో తను వేసే పాత్ర తాలూకూ ఛాయలు ఎలా వుండబోతున్నాయి.. ఆ క్యారెక్టర్ ప్రేక్షకుల్లో తనకు ఏ విధమైన గుర్తింపును తెచ్చిపెట్టబోతోంది అన్నదే ఈ అమ్మడి ఆలోచనట. అందుకే వేసే ప్రతి అడుగు ఆచి తూచి ఉంటుంది. అయితే గ్లామర్ పాత్రలే ఏ నటికైనా అతి త్వరగా గుర్తింపు తెస్తాయన్నది తెలిసిందే. మరి ఈ విషయం గురించి లావణ్యను కదిలిస్తే- ‘‘అలా ఎవరు చెప్పారు? ఏ నటికైనా తను చేసే పాత్ర కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోవాలంటే ఆ క్యారెక్టర్ వైవిధ్యంతో కూడుకున్నదై వుండాలి. అలాంటప్పుడే ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసుకోగలుగుతాం. గ్లామర్ పాత్రలు ఇలా వచ్చి అలా వెళతాయి అంతే! నేను మాత్రం వైవిధ్యమైన పాత్రల వైపే తొంగి చూస్తున్నా. అలాంటి పాత్రల్లో నటించడమంటే అదృష్టం కావాలి. ఆ పాత్రల్లో నటిగా ఆత్మ సంతృప్తి కలుగుతుంది’’అని చెప్పుకొచ్చింది. దటీజ్..లావణ్య!

-సమీర్