'క్లాప్' కొట్టు గురూ!

‘్ఫదా’ చేసేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘్ఫదా’లో తళక్కున మెరిసిన కథానాయిక సాయిపల్లవి తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ‘్ఫదా’ చేసేసింది. తన పాత్రలో అడుగడునా తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించి అందర్నీ మెప్పించి చిత్ర విజయంలో ప్రధాన భూమిక పోషించింది. అంతేకాదు, విమర్శకుల నుంచి మంచి మార్కుల్ని కొట్టేసింది. ఇక తెలుగులో సాయిపల్లవికి ఎదురేలేదన్న టాక్‌ని తెచ్చుకుంది. టాలీవుడ్‌లో నటించిన ‘్ఫదా’ మంచి విజయాన్ని అందుకోవడంతో సాయిపల్లవికి ఇక్కడా అభిమానులు ఏర్పడ్డారు. దాని ఫలితమే ఇతర భాషల్లో సాయిపల్లవి నటించిన చిత్రాలను తెలుగులోకి తెచ్చేందుకు నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. మలయాళంలో దుల్కన్ సల్మాన్‌కు జంటగా తాహిర్ దర్శకత్వంలో ఈ అమ్మడు నటించిన ‘కలి’ని తెలుగులోకి డబ్ చేస్తున్నారు. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయిపల్లవికి తెలుగులో అభిమానులు ఏర్పడడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. ఏమైనా ప్రస్తుతం ఉన్న కథానాయికలు సాయి పల్లవి నటనను చూసి అమ్మో..అని భయపడుతున్నారట. తమకు రావలసిన అవకాశాలను సాయి ఎక్కడ కొట్టేసుకుపోతుందోనని బెంగపెట్టుకుంటున్నారట!

-సమీర్