'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్..హెబ్బా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏ క్యారెక్టర్ చేసినా అందులో లీనమవ్వాలి. అప్పుడే ఆ పాత్రకు జీవం పోసిన వాళ్లమవుతాం. కెరీర్‌లో ఎప్పుడూ గొప్ప గొప్ప పాత్రలు రాకపోవచ్చు. అయితే వచ్చినవన్నీ మంచివే కానక్కర్లేదు. ఎంచుకున్న ప్రతీ పాత్రకు నటిగా న్యాయం చేసినప్పుడు కలిగే తృప్తి అంతా ఇంతా కాదు. అంతేకాదు, పోషించిన పాత్ర మనకు పేరు తెచ్చి కెరీర్‌ని ముందుకు తీసుకెళ్లడంలో మన ప్రతిభ కనపడాలి’’ అంటోంది అందాల తార హెబ్బాపటేల్. టాలీవుడ్‌లో చక్కటి ప్రతిభ కనబరుస్తూ కెరీర్‌లో ముందుకు దూసుకెళుతున్న ఈ బ్యూటీ చేసే ప్రతీ చిత్రమూ, వేసే ప్రతీ క్యారెక్టరూ తనకు బాగా నచ్చాలి. నచ్చడమే కాదు, ఆ పాత్ర కథలో భాగమవ్వాలి. అలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచి తూచి అడుగులు వేస్తోంది. అందుకే అతి తక్కువ కాలంలో నటిగా మంచి మార్కుల్ని కొట్టేసింది. అయితే చేసేవన్నీ రొటీన్ పాత్రలేనా? అని హెబ్బాను కదిలిస్తే- ‘‘అలా అని ఎందుకనుకుంటున్నారు. నేను పోషిస్తున్న పాత్రలు రొటీన్ ఏం లేవే! యువతరం కథల్లో కథానాయికలు అలానే వుంటారు. అలా వుండడం వల్లే క్రేజ్ ఏర్పడుతుంది. రొటీన్ పాత్రల వైపు నేను కనె్నత్తి కూడా చూడను. ప్రతీ పాత్ర విభిన్నంగానే వుండాలని కోరుకుంటా’’అంటూ సెలవిచ్చింది. దటీజ్..హెబ్బాపటేల్!!

-సమీర్