'క్లాప్' కొట్టు గురూ!

ముందు నేను నటిని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను నటించిన సినిమా గురించి మాట్లాడండయ్యా, ఆ పని చేయకుండా మా వ్యక్తిగత జీవితాలపై ఎందుకు దృష్టిపెడతారు అంటూ గత కొనే్నళ్లుగా అనేకమంది హీరోయిన్లు అడిగే పాత ప్రశే్న అడుగుతోంది పొడుగుకాళ్ల సుందరి కృతి సనన్. మహేష్‌బాబుతో ‘వన్’, నాగచైతన్యతో ‘దోచేయ్’ చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ అమ్మడు. కానీ రెండు చిత్రాలు సరైన అవకాశాలను తెచ్చిపెట్టకపోవడంతో బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు ఏవీ లేకపోయినా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలుగా చెలామణి అవుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన బరేలీకి బర్ఫీ చిత్రం విజయవంతం అవ్వడంతో అందరూ కృతిసనన్‌వైపే చూస్తున్నారు. ఆమె గ్లామర్‌కు కాకుండా నటనకే మార్కులు పడడంతో కృతిసనన్‌కు కూడా తనపై తనకు నమ్మకం కుదిరింది. అందుకే ఇన్నాళ్లుగా రాజ్‌పుత్ ప్రియురాలు అన్న పేరును తొలగించుకొని ఓ మంచి హీరోయిన్‌గా గుర్తింపు పొందాలని ఉవ్విళ్లూరుతోంది కృతి. ‘మా వృత్తి ధర్మం ప్రకారం నిబద్ధతగానే పనిచేస్తాం. మానత్వ విలువలను కాపాడుకుంటాం కానీ తమ వ్యక్తిగత జీవితంపై ప్రతివారూ దృష్టిపెట్టడంతో బాధపడతాం. ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోరూ..’ అంటూ ప్రశ్నిస్తోంది. నిజమే మరి!

-సమీర్