'క్లాప్' కొట్టు గురూ!

కోరికలేం లేవు కానీ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేపలు పట్టేది నాకోసం కాదండోయ్.. మా అమ్మ కోసం అంటోంది అందాల తార అనుష్క. సహజంగా ఎవరికైనా వేటకు వెళ్లి చేపలు పట్టుకురావాలన్న కోరిక వుంటుంది. కానీ సినిమా తారలకు కోరికలేమీ లేకపోయినా అలా తీరిపోతూనే వుంటాయి. ఇదే విషయాన్ని నటి అనుష్క చెప్పుకొచ్చింది. తనకు ఎలాంటి కోరికలూ లేవట. ఏ కోరిక అయినా సరే అమ్మ కోరినట్లుగా తాను కనిపించడమే అంటోంది. మహారాణిలా కనిపించాలని అనుష్క తల్లి అనుకున్నదట. అందుకు తగ్గట్టుగానే అనుష్క అరుంధతి, రుద్రమదేవి చిత్రాలలో యువరాణిగా నటించి మెప్పించింది. తల్లి కన్న కలలన్నీ అనుష్క ఒక్కొక్కటిగా తీర్చేస్తోంది. ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలో నటించాలని తనకెప్పుడూ ఉండదని, అవకాశాలు అలాంటివి వెతుక్కుంటూ రావడంతో కాదనలేక నటించేశానని, అవన్నీ తన తల్లిని సంతోషపెట్టినందుకు మరింత ఆనందం కలుగుతోందని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం అనుష్క తల్లి తన కూతుర్ని చేపలు పట్టే అమ్మాయిగా చూడాలనుకుంటోందట. త్వరలో ఆమె కలలన్నీ నిజం అవుతాయి కనుక అలాంటి పాత్ర కూడా వస్తుందని, అందులో నటిస్తానని చెప్పేస్తోంది ఈ అందాల తార. తనకిష్టంలేని పాత్రలు కోరుకోవద్దని, ఇప్పటికే అనేకరకాల పాత్రల్లో నటించేశాను కనుక, ఇక కోరికలు పెట్టుకోవద్దని తల్లికే చెబుతోందట అనుష్క. మళ్లీ ఏదైనా విచిత్రమైన పాత్రలో చూడాలంటే ఆమెకే ఇబ్బంది కదా! అన్నట్టు పెళ్లి జరిగినట్టు ఆమె తల్లికి కల రావడం లేదేమో!

-సమీర్