'క్లాప్' కొట్టు గురూ!

మరో ‘డర్టీ పిక్చర్’లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’తో సంచలనం రేపింది. ఆ చిత్రంలో టాలీవుడ్ సెక్సీ ఐటెం బాంబ్ సిల్క్‌స్మిత పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ‘డర్టీ పిక్చర్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు, ఆ చిత్రం బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. తాజాగా మరోసారి ‘డర్టీ పిక్చర్’ లాంటి సినిమా చూపించబోతోంది విద్యాబాలన్. ఆ సినిమా పేరు ‘తుమ్హారీ సులు’. అయితే ‘డర్టీపిక్చర్’లో అందాలు ఆరబోసి ఇలాంటి క్యారెక్టర్ చేయగా, ఈ సారి తన వాయిస్‌తో మత్తెక్కించనుంది విద్యాబాలన్. ‘మై కర్ సక్తా హూ..’ అనే ట్యాగ్‌లైన్ తగిలించడం చూస్తే.. సినిమా థీమ్ సగం అర్థమవుతుంది. ఈ చిత్రంలో విద్యాబాలన్ పాత్ర ఒక సాధారణ గృహిణికాగా.. ఒక రేడియో జాకీగా మారే కథ ఉంటుంది. అయితే ఆ కార్యక్రమం ఏంటంటే.. మిడ్‌నైట్ సమయంలో ప్రసారమయ్యే సెమీ అడల్డ్ కంటెంట్ కార్యక్రమంలో మాటలతో మత్తెక్కించాల్సి ఉంటుందన్న మాట. రేడియో జాకీనే అయినా సెక్సీ కబుర్లను తన స్వరంతో చెప్పి మత్తెక్కించాలి. అలా తన మృదు మధురమైన మాటలతో మాయలో పడేందుకు సులోచన పాత్రలో విద్యాబాలన్ వచ్చేస్తోంది. తాజాగా విడుదల అయిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.

-సమీర్