'క్లాప్' కొట్టు గురూ!

మళ్లీ లైమ్‌లైట్‌లోకి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీయ.. శ్రీయ... గత కొనే్నళ్ల క్రితం టాలీవుడ్‌లో దర్శక, నిర్మాతల్లోనే కాదు, అగ్ర హీరోల మనసుల్లోనూ మెలిగిన పేరు. అందుకు కారణం లేకపోలేదు. పరిశ్రమలోకి అడుగుపెడుతూనే తన గ్లామర్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను చిత్తుచేసేసింది. యువతరం క్రేజీ నటులతో జోడీ కడుతూనే, అగ్ర హీరోల చిత్రాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే ఇది గతం.. మరి ఇప్పుడు మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావడానికి తెగ తాపత్రయ పడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో అగ్ర హీరోలందరి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేసి తన గ్లామర్‌తో విశేషంగా అలరించిన ఈ బ్యూటీ అవకాశాల కోసం మళ్లీ దర్శక, నిర్మాతల చుట్టూ తిరుగుతోంది అని సర్వత్రా వార్తలు వినిపిస్తున్నాయి. పరిశ్రలోకి వచ్చిన తొలి రోజుల్లో శ్రీయ వేసిన మోడ్రన్ డ్రెస్సులు, ఆమె ధరించిన చీరకట్టులోనూ అందం పరవళ్లు తొక్కింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘గ్లామర్-వల్గారిటీ’ అన్న అంశంపై తెగ స్పందించింది. ఆ స్పందన ఆమె మాటల్లోనే- ‘‘కథానాయికలు చీరలో కనిపిస్తే చాలా పద్ధతిగా వుందంటారు. అదే మోడ్రన్ దుస్తుల్లో కన్పిస్తే చాలు వల్గారిటీ అనే ముద్రను వేసేస్తారు. చీరకట్టుతోనో, మోడ్రన్ డ్రస్సులతోనే ఆయా వ్యక్తుల క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేస్తారు? మేం ఎప్పుడూ ఒకేలా వుంటాం. మమ్మల్ని చూసే కళ్లలోనే ఏదో తేడా వుంది. చీరకట్టులోనైనా, మోడ్రన్ డ్రస్సుల్లో అయినా అదే అందం. చూసే కళ్లని బట్టే అది అందమా.. వల్గారిటీనా అనేది ఆధారపడి వుంటుంది’’ అని ఎంతో తెలివిగా చెప్పుకొచ్చింది. దటీజ్..శ్రీయ!

-సమీర్