'క్లాప్' కొట్టు గురూ!

తెలివైందే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ హాట్‌గా అందరి నోళ్లలో చక్కర్లు కొడుతున్న విషయం ఒకటి వుంది. అదే.. విడుదల కాబోయే మూడంటే మూడు చిత్రాల గురించే. అందులో ఒకటి దీపికా పదుకొనే నటించిన ‘పద్మావతి’కాగా, మరోటి విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించిన ‘తుమ్హారీ సులు’. ఈ రెండింటితో పాటు మరో చిత్రం కూడా రానుంది. అదే అమితాబచ్చన్, రిషీకపూర్‌ల ‘101 నాటౌట్’. ఈ మూడు చిత్రాలు విడుదల విషయంలో ఒక్క కొలిక్కిరాలేకపోతున్నాయట. ముఖ్యంగా దీపికాతో గొడవ ఎందుకని విద్యాబాలన్ చిత్రం మరింత ముందుకొచ్చిందట. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రాజ్‌పుత్ రాణి పద్మావతిగా దీపిక నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్.జె. (రేడియో జాకీ) సులోచనగా విద్యాబాలన్ నటించిన ‘తుమ్హారీ సులు’ను కూడా ముందు డిసెంబర్ 1న విడుదల చేయాలనుకున్నారు. వీటితో పాటు అమితాబ్ చిత్రం ‘101 నాటౌట్’కూడా అదే తేదీన రానుందని ఖరారు చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విద్యాబాలన్ టీమ్ కొంచెం జాగ్రత్త పడింది. నవంబర్ 24న వస్తామని ప్రకటించారు. అయితే పద్మావతి ట్రైలర్ విడుదల తర్వాత మరో వారం ముందుకొచ్చింది విద్యాబాలన్ చిత్రం. దీపిక సినిమా వచ్చిన తర్వాత సులోచన ఎక్కడ కనిపించకుండా పోతుందోనని భయంతో పది రోజుల గ్యాప్ ఉండేలా చూసుకున్నారట. ‘పద్మావతి’లో అసలే దీపికా పదుకొనే నగలు, ఆమె రాజసం చూస్తే భారీగా ఉన్నాయి. అదే విద్యాబాలన్ చిత్రంలోనేమో సింపుల్‌గా శారీ కట్టుకొస్తున్నారు. దీపిక భారీ హడావిడి ముందు సింపుల్ శారీ ఎక్కడ చిన్నబోతుందోనని విద్యాబాలన్ చిత్రాన్ని మరింత ముందుకు తీసుకొచ్చేశారని బాలీవుడ్ టాక్. మొత్తం మీద ఇదంతా విద్యాబాలన్ తెలివేనని చెప్పుకొస్తున్నారు బాలీవుడ్ జనం. అదీ..సంగతీ!