'క్లాప్' కొట్టు గురూ!

జర్నలిస్టుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్ జంటగా అజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఈ సందర్భంగా హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ చెప్పిన విశేషాలు. ఇది రెండు ఫ్రేమ్స్‌లో జరిగే సినిమా. ఒక ఫ్రేమ్ 1990 ఎల్‌టిటిఈ నేత ప్రభాకరన్ కోణంలో వుంటే ఇంకొకటి ప్రస్తుతంలో వుంటుంది. నేను ప్రస్తుతంలో జర్నలిస్టుగా కనిపిస్తాను. కథ చాలా సీరియస్‌గా వుంటుంది. పాటలు, కామెడీ లాంటివి అస్సలు ఉండవు. ప్రభాకరన్ టైమ్‌లో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలనే ఈ సినిమా చేశారు. 1990కి, ప్రస్తుతానికి సంబంధం ఏమిటనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. దర్శకుడు అజయ్ ఈ సినిమా కోసం చాలా రీసెర్చి చేశారు. ఎల్‌టిటిఈ వద్దకు వెళ్లి వాళ్ల అనుభవాల్ని, అప్పటి పరిస్థితుల్ని తెలుసుకుని రీసెర్చి చేసి వాస్తవ ఘటనల ఆధారంగానే సినిమా చేశారు. ఇందులో కథను చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఆయన చేసిన రీసెర్చి చూస్తే చాలా స్ఫూర్తిపొందినట్లు ఉంటుంది. ఇలాంటి కథలు అందరూ చేయరు. కేవలం దర్శకుడిమీద నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే చేస్తారు. ఇందులో ప్రభాకరన్ సమయంలో జరిగిన సంభాషణలు, అడ్వెంచర్స్ అలాగే ఉంటాయి. ఇందులో లవ్ ట్రాక్ వుంటుంది కానీ అదే ప్రధాన అంశం కాదు. కథలో సెటిల్డ్‌గా నడుస్తుంటుంది. నేను కేవలం కమర్షియల్ సినిమాలే గాక విభిన్నమైన సినిమాల్ని చేయాలనుకుంటున్నాను. అందుకే ఈ సినిమాని ఎంచుకున్నాను. కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వస్తూనే వుంటాయి కానీ ఇలాంటివి తరచూ రావు. మనోజ్ చాలా పవర్‌ఫుల్ యాక్టర్. ఆయన స్క్రీన్‌మీద వుంటే వరెవరూ కనబడరు. డైలాగ్స్ కూడా చాలా పర్‌ఫెక్ట్‌గా చెప్తారు. సినిమా కోసం కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. ఇన్ని సినిమాలు చేసినా బ్రేక్ రాకపోవడానికి కారణం తెలీదు. బ్రేక్ రాలేదని నేనెప్పుడూ బాధపడలేదు. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తాను అంతే. తమిళంలో ఒక సినిమా పూర్తయింది. తెలుగులో నరేష్, నవీన్ చేస్తున్న ‘విఠలాచార్య’లో నటించాను. అలాగే మరొక తెలుగు సినిమాలో కూడా చేస్తున్నాను.

-సమీర్