'క్లాప్' కొట్టు గురూ!

వ్యాపారంలోకి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య సినిమా స్టార్స్.. కేవలం నటనమీదే కాకుండా అటు వ్యాపార రంగాల్లో రాణించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తారలు ఈ రంగంలో దూసుకుపోతున్నారు. వేరే ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూనే తమ సొంత బ్రాండ్స్‌ని ప్రచారం చేసుకుంటూ మంచి మార్కెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సల్మాన్‌ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే దుస్తుల కంపెనీ మొదలుపెట్టాడు. హృతిక్, అనుష్క, సోనమ్‌కపూర్ ఇప్పటికే బట్టల తయారీ కంపెనీలతో బిజీగా ఉన్నారు. ఇక తమన్నా నగల వ్యాపారంలో బిజీగా వుంది. తాజాగా బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనే కూడా బట్టల తయారీ కంపెనీ మొదలుపెట్టనుంది. ఆల్ అబౌట్ యూ అనే పేరుతో బ్రాండింగ్ చేయనున్నదట. ప్రముఖ ఆన్‌లైన్ కంపెనీ మంత్రతో కలిసి మార్కెట్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆ దుస్తులను వేసుకుని ఫొటో షూట్స్ కూడా చేస్తుంది. ఇప్పటికే ముంబైలో ఈ కంపెనీని లాంఛ్ చేసిందట దీపికా.