'క్లాప్' కొట్టు గురూ!

వరల్డ్‌టూర్‌లో అమలాపాల్!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వాళ్లకు కొత్త ప్రాంతాలను చూడడం బాగా ఇష్టం. అందుకే ఇప్పుడు సౌత్ బ్యూటీ అమలాపాల్ కూడా ఓ అందమైన ప్రాంతంలో చక్కర్లు కొడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న లడఖ్ టూర్‌కి వెళ్లడం ఓ మధురానుభూతి. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా.. కాసింత గ్యాప్ దొరకడంతో మంచు కొండల్లో షికార్లకు వెళ్లిపోయింది అమల. ఈ సీజన్‌లో లడఖ్ మరింత అందంగా ఉంటుంది. ఆ అందాలను తన మదితో పాటు కెమెరాలో కూడా అమలాపాల్ బంధించేస్తోంది. ఆ స్టేట్‌లో ఫ్లైట్ దిగడానికి ముందు నుంచే సోషల్ మీడియాలో అప్‌డేట్స్ పెట్టేస్తోంది. దిగీ దిగగానే ఇక్కడ తెగ చలిగా ఉంది బేబీ అంటూ ఓ సెల్ఫీతో పాటు చెపిన అమలాపాల్.. కాసింత రెస్ట్ కూడా తీసుకోకుండా అదే రోజున ఓ ఎత్తయిన ప్రాంతంలో ఉన్న శాంతి స్థూపం సందర్శించుకుంది. టూరిస్టులతో పాటు కలిసిపోవడం.. రోడ్లపై మైలురాళ్ల దగ్గర ఫొటోలు తీసుకుని మెమరీస్‌గా భద్రపరచుకోవడమే కాదు.. వీటన్నింటినీ తన ఫాలోయర్స్‌కు ఫ్యాన్స్‌కు కూడా షేర్ చేసేస్తూ లడఖ్ టూర్‌లో తన ప్రతీ అప్‌డేట్‌ను పంచుతూ అలరిస్తోంది అమలా.