'క్లాప్' కొట్టు గురూ!

గ్లామర్ డోస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైన కొత్త హీరోయిన్‌లలో సురభి ఒకరు. బీరువా సినిమాతో ఫిలింనగర్‌లో అడుగుపెట్టిన సురభి, ఆ తరువాత జెంటిల్‌మాన్, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాల హిట్‌తో గుర్తింపు పొందింది. అయినా కానీ సురభికి సరైన అవకాశాలు తలుపుతట్టలేదు. ఇప్పటివరకూ గ్లామర్ పరంగా ఆకట్టుకునే పాత్రలు తాను చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని గుర్తించినట్లుగా వుంది. అందుకే గ్లామర్ పాత్రల్లో నటిస్తానని చెబుతోంది. తాజాగా అల్లు శిరీష్ చిత్రంలో నటించడానికి అవకాశం రావడంపట్ల ఆమె ఆనందంగా వుంది. ఈ పాత్రలో గ్లామర్ డోస్ పెంచి నటించడానికి సిద్ధమవుతోందట. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ కొట్టిన వి.ఐ.ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో యువ హృదయాలకు గిలిగింతలు పెడతానంటోంది. ఓకె.. కీపిట్ అప్!