'క్లాప్' కొట్టు గురూ!
భారీ డిమాండ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్లోనే కాకుండా దక్షిణాదిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి సన్నీలియోన్. అయితే అమ్మడు బాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్తోపాటుగా హీరోయిన్గా కొన్ని కొత్త తరహా సినిమాలను చేసి హిట్స్ అందుకుంటోంది. అంతేకాకుండా స్పెషల్ క్యారెక్టర్స్‌తో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే బాలీవుడ్లో సన్నీకి మంచి ఆఫర్లు అందుతున్నాయి. అయితే సౌత్‌లో మాత్రం సన్నీ ఎక్కువగా స్పెషల్ సాంగ్స్‌లోనే నటించింది. నటిగా ఇంకా అవకాశాలను అందుకోలేదు. అయితే మరికొన్ని రోజుల్లో ఆమె హీరోయిన్గా సౌత్ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతోంది అనే టాక్ వినిపించబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒక చారిత్రాత్మక చిత్రం తెరకెక్కనుంది. ఆ చిత్రంలో సన్నీ యువరాణి పాత్రలో నటించనున్నదని సమాచారం. తమిళ దర్శకుడు వడి వుడయాన్ తెరకెక్కించే ఈ సినిమాను స్టీఫెన్ నిర్మించనున్నాడు. అయితే అందులో నటించడానికి సన్నీ 3.25 కోట్ల రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేసిందట. నిర్మాత కూడా అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.