'క్లాప్' కొట్టు గురూ!

సరైన దారిలో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెరపై వెలుగులు విరజిమ్మాలనీ..ఎంతో ఎత్తుకు ఎదిగి బాగా డబ్బు సంపాదించేయాలనీ..కెరీర్‌లో వెనక్కు తొంగిచూడకుండా పరుగులు పెట్టాలనీ చిత్రసీమలోకి అడుగుపెట్టే ప్రతీ తారా కలలుగంటూనే వుంటుంది. అయితే కొంతమంది భామలకు ఇది మినహాయింపు. అలాంటి మినహాయింపులో కొత్త అందం సురభి ఒకరు. ‘వేళ ఇల్లాద పట్టదాం’ (తెలుగులో రఘువరన్ బిటెక్) అనే చిత్రం ద్వారా తమిళ చిత్రమలోకి తొలి అడుగుపెట్టిన ఈ భామ అటు తర్వాత టాలీవుడ్‌లోనూ తన ప్రతిభను చాటుకుంటోంది. బీరువా, ఎక్స్‌ప్రెస్‌రాజా, జెంటిల్‌మెన్ ఇలా వరుస విజయాలతో మంచి జోష్‌లో వుంది. నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్‌మెన్’ సురభికి తెలుగులో మంచి పేరునే సంపాదించిపెట్టింది. తమిళంలో రెండు మూడు చిత్రాలే చేసినా, తెలుగులో మాత్రం మరిన్ని ఆఫర్లు వస్తూనే వున్నాయి. ఎన్ని అవకాశాలు వచ్చినా నా ప్రాధాన్యత మాత్రం వైవిధ్యానికే అంటోంది సురభి. గ్లామర్..గ్లామర్ అంటూ వెళ్లకుండా పెర్‌ఫార్మెన్స్ వైపే తన మొగ్గు అంటూ ఎంతో తెలివిగా చెప్పుకుంటోందిట. సరైన దారిలోనే అడుగులు వేస్తున్న సురభి తెలివైందే సుమా!

-సమీర్