'క్లాప్' కొట్టు గురూ!

డీ-గ్లామర్‌తో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో తను నటించిన చిత్రాల ద్వారా తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరచుకుంది నటి కంగనా రనౌత్. చేసిన చిత్రాలే కాదు, పోషించిన పాత్రలూ కంగనాకు మంచి కెరీర్‌నే అందించాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఇటీవల బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాలు చాలానే వున్నాయి. వాటికి ఆదరణ కూడా బాగానే వుండడంతో చాలా మంది దర్శక, నిర్మాతలు ఇలాంటి చిత్రాలపైనే మోజు పడుతున్నారు. అలాంటి క్యారెక్టర్ ఒకటి కంగనా చేస్తోంది. జాతీయ ఉత్తమనటిగా మూడుసార్లు అవార్డు అందుకున్న కంగనా ఇలాంటి తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ‘సిమ్రాన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనాది గుజారాతి ఎన్నారై నర్సు క్యారెక్టర్. గ్లామర్ షోకు ఏ మాత్రం వెనుకాడని ఈ బ్యూటీ ఈ చిత్రంలో ఎలాంటి మేకప్ లేకుండా డీ-గ్లామర్ క్యారెక్టర్‌ను పోషిస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ చిత్రంపై పడిందట. ఈ చిత్రానికి హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తుండగా, భూషణ్‌కుమార్, శైలేష్‌సింగ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ‘ట్విట్టర్’లో హల్‌చల్ చేయడంతో నిజంగానే క్రేజ్ ఏర్పడింది. వాహ్..కంగనా!!