'క్లాప్' కొట్టు గురూ!

బాలీవుడ్డే గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది తారలు టాలీవుడ్‌లో తమను తాము నిరూపించుకున్నాక.. బాలీవుడ్‌పై గురి పెట్టడం మామూలే. గత ఎంతో కాలంగా చిత్రసీమలో మనం ఇలాంటి భామల పరుగులు చూస్తూనే వున్నాం. అదే దారిలో మిల్క్‌బ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది. పదేళ్ల సినీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఈ బ్యూటీ తెలుగు, తమిళంలో నటిస్తూనే బాలీవుడ్‌వైపు గురి పెట్టింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో తన ప్రతాపాన్ని చూపించిన తమన్నా బాలీవుడ్‌లో కూడా జెండా ఎగరేయాలనుకుంటోంది. కానీ అక్కడ పరాజయాలు తప్పలేదు. అయినా పట్టువదలకుండా బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే వుంది. ఇప్పుడిప్పుడే అక్కడా అవకాశాలు దక్కుతున్నాయి. కచ్చితంగా బాలీవుడ్‌లో ఎదుగుతానన్న నమ్మకం తమన్నాలో వుంది. ‘‘ టాలీవుడ్, కోలీవుడ్‌లో నేనేంటో నిరూపించుకున్నాను. అలాగే బాలీవుడ్‌లో కూడా నా ప్రతిభను చూపాలనుకుంటున్నా. తప్పకుండా ఆ లక్ష్యం వైపు నా పరుగు వుంటూనే వుంది. నటన అనేది ఎక్కడైనా ఒక్కటే అన్నది నా భావన. మంచి పాత్రలు..మంచి బ్యానర్లవైపు దృష్టిపెట్టాను. కచ్చితంగా సాధించితీరుతా’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆల్ ది బెస్ట్ తమన్నా!!

-సమీర్