'క్లాప్' కొట్టు గురూ!

ప్చ్..శ్రీయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటున్నారంతా. అందుకు కారణం లేకపోలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించడమేగాక, ఆయా భాషల్లో అగ్ర నటులతో ఆడిపాడింది శ్రీయ. అయితే చాలా కాలం తర్వాత శ్రీయ బాలయ్య సరసన ఓ క్యారెక్టర్ చేస్తుండడమే ఇందుకు కారణమైంది. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య టైటిల్ పాత్రలో రూపుదిద్దుకుంటున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎంతో చారిత్రాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన వశిష్టీదేవి పాత్రను శ్రీయ పోషిస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా దర్శకుడు అనుష్కను, నయనతారను సంప్రదించారు. వాళ్లిద్దరూ ఈ పాత్రను పోషించేందుకు ససేమిరా అన్నారట. దాంతో ఆలోచనలో పడ్డ దర్శకుడు ఎట్టకేలకు శ్రీయను సంప్రదించడంతో ఎగిరిగంతేసిందట. ఈ చిత్రంలో ఈ క్యార్టెర్‌కు ఏ మాత్రం ప్రాధాన్యం లేకపోవడం వల్లే ఆ ఇద్దరు తారలు ఈ పాత్రను పోషించడానికి ముందుకు రాలేదు. శ్రీయ మాత్రం ఏం ఆలోచించకుండా ఈ క్యారెక్టర్‌ను చేస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన శ్రీయ ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. అసలే అవకాశాలు సన్నగిల్లి కనుమరుగవుతున్న స్థితిలో వచ్చిన ఈ క్యారెక్టర్ శ్రీయకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాల్సిందే మరి!

-సమీర్