'క్లాప్' కొట్టు గురూ!

ఆమె రూటే వేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాలీవుడ్ కత్రీనాకైఫ్ రూటే వేరు’ అంటున్నారు ఆమె సన్నిహితులు. నిజమే మరి! నటించే చిత్రాల విషయంలోనూ... పోషించే పాత్రల ఎంపికలోనూ ఎప్పటికప్పుడు రూటు మార్చేస్తూనే వుంటూ తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే వుంది. కథ నచ్చి.. అందులో పాత్రకు సెట్ అవుతుందో లేదో చూసుకుంటుందే తప్ప.. హీరో ఎవరనేది మాత్రం అస్సలు పట్టించుకోదట. నిజమేనా..? నమ్మేద్దామా మరి? ఈ విషయం గురించే కత్రీనాను ఒక్కసారి కదిలిస్తే- ‘‘ఎస్. అంతే! ‘జిందగీ నా మిలేగీ దోబారా’ ఓ విభిన్న చిత్రం. కథ, దర్శకుడిని నమ్మి ఆ చిత్రంలో నటించానే తప్ప, హీరోని చూసి కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది. ‘జాగ్గా జాసూస్’ ‘టైగర్ జిందా హై’ వంటి చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా వున్న కత్రీనా ఇటీవల జరుగుతున్న ఫ్యాషన్ షోలకు హాజరవుతూ అందర్నీ విశేషంగా ఆకర్షిస్తోంది. అందుకే కత్రీనా రూటేవేరు అంటున్నారంతా!!

-సమీర్