'క్లాప్' కొట్టు గురూ!

అమీ..ఆశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోడల్‌గా, నటిగా అందరిచేత ప్రశంసలందుకున్న అందాల తార బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ కళ్లు ఇప్పుడు ‘బాహుబలి’ ప్రభాస్‌పై పడ్డాయట. ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సాధించిన అఖండ విజయం ఆమె మనసు కొల్లగొట్టిందట. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కొల్లగొట్టడం తెలిసిందే. అంతేకాదు, ఈ చిత్రంలో ‘బాహుబలి’ పాత్రలో ఉరిమిన ప్రభాస్ ఎందరో యువతులకు రాకుమారుడై పోయాడంటే ఆశ్చర్యం లేదు. ప్రభాస్‌ను ఆరాధిస్తున్న అందాలభామల్లో అమీజాక్సన్ కూడా చేరిపోయింది. ‘మదరాసు పట్టణం’ అనే తమిళ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన అమీ ఆ తర్వాత ‘ఏక్ దివానాథా’, రామ్‌చరణ్ ‘ఎవడు’, విక్రమ్ ‘ఐ’తో పాటు తాజాగా విజయ్ ‘తేరీ’, రజనీ-అక్షయ్‌కుమార్-శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రోబో2.0’ చిత్రంలో కూడా మెరిసిపోనుంది. అయితే ‘బాహుబలి’ చిత్రం చూసిన అమీ అందులో ప్రభాస్ నటనకు ముగ్థురాలైపోయిందట. ఎప్పటికైనా ప్రభాస్‌తో నటించాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకుందట. ఈ అమ్మడి అత్యాశ మరి ప్రభాస్ చెవిన పడిందో..లేదో.. చూద్దాం..అమీ ఆశ నెరవేరుతుందో..లేదో..!!

‘శృతి’ మించుతోందా..!?
అందాలభామ, కమల్ ముద్దుల తనయ ఈ మధ్య ఏ ఫంక్షన్‌కెళ్లినా తన అందాలతో కనువిందు చేస్తుందట. తెలుగు, తమిళ చిత్రాల్లో తన నటనతో అందరి మనసులను కొల్లగొట్టిన ఈ బ్యూటీ సెలెక్టివ్‌గానే చిత్రాలను, అందులో తన పాత్రలను ఎంపిక చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. బాలీవుడ్డే టార్గెట్‌గా దూసుకెళుతున్న ఈ అమ్మడు ఇప్పుడు తన పంథాను మార్చి అందుకనుగుణంగానే తన గ్లామర్‌తో అందర్నీ తన వైపునకు తిప్పుకునేలా విశ్వ ప్రయత్నాలు చేస్తుందిట. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఏ కార్యక్రమానికి వెళ్లిన గ్లామర్‌ని ఎక్స్‌పోజ్ చేస్తూ అందరీ దృష్టిలో పడుతుందట. ‘అవునా..ఇది నిజమా?’ అని శృతిని కదిలిస్తే- ‘‘్ఛ..ఇదేం ప్రశ్న!? అంత ఖర్మ నాకేం పట్టింది? ఇప్పటికే బోల్డు అవకాశాలతో డైరీ నిండిపోయింది. కొత్తగా అవకాశాల కోసం నేనేం ఇలాంటి దిక్కుమాలిన వేషాలు వేయాలనుకోవడం లేదు. కొత్తగా కనిపించాలనుకోవడం తప్పేం కాదుకదా?’’అంటూ ఎదురు ప్రశ్నవేసి అక్కడి నుంచి తప్పించుకుందట. ‘శృతి’మించిపోతుందంటే ఎలా నమ్ముదాం.. ఆమె మాటలు విన్నాక. దటీజ్..శృతి!!

ఇక హాట్ హాట్‌గా...!
ఇన్నాళ్లు వైవిధ్యం..వైవిధ్యం అంటూ తెగ ఒయ్యారాలు పోయిన అందాలభామ నిత్యామీనన్ ఇక లాభం లేదనుకుందో..ఏమో గేరు మార్చిందట. వైవిధ్యం పేరుతో కొన్ని చిత్రాల్లో మంచి అవకాశాలను సొంతం చేసుకున్న ఈ సుందరికి అవి అంతగా కలిసిరాకపోగా, కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదట. నత్తనడక నడుస్తున్న కెరీర్‌ను ఇక పరుగులు పెట్టించాలనుకుంటుందిట. అందులో భాగంగానే గ్లామర్‌గా కనిపించి అటు పరిశ్రమను, ఇటు ప్రేక్షకులను తన మత్తులో పడేయాలనుకుంటుందట. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ మళయాల బ్యూటీ అందుకనుగుణంగానే చిత్రాలను ఎంపిక చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీగానే వుంది. తమిళంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘ఇరుముగన్’లో కీలక పాత్రలో నటిస్తున్న నిత్య ఇందులో ప్రేక్షకులకు కొత్త తరహాలో కనువిందు చేయనుందట. ఇప్పటి వరకు గ్లామర్‌కు దూరంగా వున్న ఈ ముద్దుగుమ్మ ఆ హద్దుల్ని చెరిపేసి, ఇక హాట్ హాట్‌గా కనువిందు చేయనుందట. దీంతో ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందంటున్నారు సినీ జనాలు.. నిత్యకు ఆల్ ది బెస్ట్ చెబుదామా?

-సమీర్