'క్లాప్' కొట్టు గురూ!

ప్చ్.. సోహా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చాలా మంది అనుకుంటుంటారు నటీనటుల వారసులకు పరిశ్రమలో అవకాశాలకు కొదువేలేదని. కానీ.. అందులో ఏ మాత్రం నిజం లేదు. ప్రారంభంలో అవకాశాలు మాత్రమే వస్తాయి. కానీ వాళ్లలా అనుకున్నంత పేరు, ప్రఖ్యాతులు అంత తొందరగా రానే రావు’’ అంటోంది సోహా అలీఖాన్. అలనాటి నటి షర్మిలా ఠాగూర్ కుమార్తెగా, నటుడు సైఫ్ అలీఖాన్ సోదరిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన సుందరి సోహా అలీఖాన్. కానీ తల్లి.. సోదరుడిలా అగ్రనటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు నిరంతరం కష్టపడుతూనే వుంది. అయినా అనుకున్నంత క్రేజ్ మాత్రం ఇంకా రాలేదనే చెప్పాలి. ఈ విషయం గురించి సోహా అలీఖాన్ చెబుతూ- ‘‘ నిజమే..సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు అంత సులువుగా పేరు తెచ్చుకోలేరు. ఎందుకంటే ఇక్కడ అందరూ పెద్దవాళ్లతో మనల్ని పోల్చి చూస్తూ మనల్ని తక్కువ చేస్తుంటారు. అందువల్లే వాళ్ల స్థాయిని అందుకోవడం చాలా కష్టమవుతుంది’’అని చెప్పుకొచ్చింది. నిజమే..ఏమంటారు మరి?!

-సమీర్