పాటల్లో యాక్సిడెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ, నేహారెడ్డి జంటగా శ్రీ జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో సింహాద్రి గణేశ్ నిర్మిస్తున్న ‘యాక్సిడెంట్’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి ఐదువేల వరకూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇలాంటి యాక్సిడెంట్లు జరుగకూడదని ప్రభుత్వం బాధ్యత వహించడంపై దర్శక నిర్మాతలు ఆలోచించి చేసిన సినిమా ఇది. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు చేసిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నానన్నారు. నిర్మాత సింహాద్రి గణేశ్ మాట్లాడుతూ- ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా హర్రర్ థ్రిల్లర్ అంశాలతో రూపొందించిన సినిమా ఇది. సినిమా అద్భుతంగా వచ్చింది అన్నారు. దర్శకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ- సమాజంలో జరుగుతున్న యాక్సిడెంట్లవల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయనే కానె్సప్టుతో చేసిన చిత్రమిది. నటీనటులు, టెక్నీషియన్లు అందించిన సహకారంతో సినిమాను అనుకున్నవిధంగా పూర్తిచేశామన్నారు.