ఖమ్మం

సిఎంను కలిసిన తుమ్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 23: ఇటీవల పాలేరు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఎన్నిక, గెలుపు, మెజార్టీ తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా తుమ్మలను అభినందించారు. తుమ్మలతో పాటు జిల్లా అధ్యక్షుడు బేగ్, మాజీ ఎమ్మెల్యే కొండబాల, నేత ఎన్‌వి తదితరులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.
మండలికి తుమ్మల రాజీనామా
* 26న ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, మే 23: ఇటీవల పాలేరు ఉప ఎన్నికల్లో గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావు శాసన మండలికి చేసిన రాజీనామాను మండలి చైర్మన్ స్వామిగౌడ్ సోమవారం ఆమోదించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 16వ తేదీన జరిగిన పాలేరు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల కౌంటింగ్ జరిగిన 19వ తేదీన ఆయన శాసన మండలికి రాజీనామ చేశారు. దానిని చైర్మన్ ఆమోదించడంతో ప్రస్తుతం తుమ్మల ఏ సభలోనూ సభ్యుడిగా లేనట్లైంది. అయితే శాసనసభకు ఎన్నికైన ఆయన ఈ నెల 26వ తేదీన స్పీకర్ ఎదుట ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.