ఆంధ్రప్రదేశ్‌

పులివెందులకు జల విందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటినుంచి కృష్ణా నీళ్లు ప్రారంభించనున్న సిఎం

కడప, జనవరి 10:కడప జిల్లా పులివెందులవాసుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. పులివెందుల జనం గొంతు తడిపేందుకు కృష్ణ నీళ్లు బిరబిరమంటూ శ్రీశైలం నుంచి కడప జిల్లా గండికోటకు చేరుకున్నాయి. అక్కడి నుంచి పైడిపాలెం రిజర్వాయర్ ద్వారా పులివెందులకు నీటిని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం కృష్ణాజలాలను లాంఛనంగా పులివెందులకు విడుదల చేయనున్నారు. కడప జిల్లా కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట రెండు కొండల నడుమ అత్యంత సుందర ప్రదేశం వద్ద గండికోట రిజర్వాయర్ నిర్మించారు.
గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26.84 టిఎంసీలు. ప్రాజెక్టు పూర్తికావడానికి చాలా సమయమే పట్టింది. 2009 నాటికే ఈప్రాజెక్టు పనులు అరకొరగా పూర్తిచేశారు. 2013లో గండికోటలో 3 టిఎంసిల నీటిని నిల్వ చేసినా ఆ నీరు పులివెందులకు తరలించలేకపోయారు. దీంతో పులివెందులవాసులు తమకు గండికోట నీళ్లు రావని డీలాపడ్డారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. కడప జిల్లాలోని గండికోట జలాశయాన్ని త్వరతగతిన పూర్తిచేసి పులివెందులకు నీరు తరలించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను నీటి విడుదల ద్వారా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి భావించారు. కాగా జిల్లాకు చెందిన మండలి ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి గండికోటనుంచి పులివెందులకు నీరు తరలించేంత వరకు గడ్డం తీసుకోనని ప్రతిన బూనారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గండికోట పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. కర్నూలు జిల్లా అవుకు జలాశయం నుంచి గత రెండు నెలలుగా గండికోటకు నీరు తరలిస్తున్నారు. అవుకు నుంచి లింగాపురం (మైలవరం) వరకు కెనాల్‌కు, లింగాపురం నుండి గండికోటకు 5.4 కి.మీల కొండలోపల తవ్విన సొరంగం ద్వారా నీరు తరలిస్తున్నారు. మంగళవారం గండికోట జలాశయంలో 4.5 టిఎంసిల నీరు నిల్వ ఉంది. అక్కడినుంచి ఎత్తిపోతల ద్వారా పైడిపాలెంకు నీరు తరలిస్తారు. ఇందుకోసం పది అత్యాధునిక మోటార్లు ఏర్పాటుచేశారు. వీటి సాయంతో పది కిలోమీటర్ల దూరం పైపులైన్లతో నీరు పైడిపాలెం చేరుకుంటుంది. గండికోట ఎత్తిపోతల పథకం వద్ద ముఖ్యమంత్రి రిమోట్ ద్వారా బుధవారం పైడిపాలెం ప్రాజెక్టుకు కృష్ణాజలాలను విడుదల చేయనున్నారు.

చిత్రం... గండికోట జలాశయం

వి.ఎ. నారాయణ