రాష్ట్రీయం

నేడు అనంతలో ముఖ్యమంత్రి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 28: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.20 గంటలకు విజయవాడలోని నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌యన్‌యస్‌యస్ రెండవ దశ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షిస్తూ 10.55 గంటలకు జిల్లా కేంద్రంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలు వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి నీరు-ప్రగతిపై ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను తిలకిస్తూ ఫారంపాండ్స్ నిర్మాణం, వాటి పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలోప్రసంగిస్తారు. నీరు-ప్రగతి అవార్డులు అందజేస్తారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.