విజయనగరం

నేడు సిఎం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 1: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం విజయనగరం జిల్లా పర్యటనకు వస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జన్మభూమి కార్యక్రమాన్ని జిల్లాలోని బొండపల్లి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం విశాఖ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 11గంటలకు బొండపల్లి మండల కేంద్రానికి చేరుకుంటారు. 11.30నుంచి మధ్యాహ్నం రెండుగంటల వరకు జరిగే జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తారని అధికార వర్గాల సమాచారం. రాష్ట్రంలో కొత్తగా 2.75లక్షల రూపాయల వ్యయంతో 300ఎస్‌ఎఫ్‌టిలతో నిర్మించే బలహీనవర్గాల గృహాల నిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. అదే విధంగా సంక్రాంతి సందర్భంగా తెల్లరేషన్ కార్డుదారులకు ఇస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీని ప్రారంభిస్తారు. వీలయితే అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జన్మభూమి గ్రామసభలో పాల్గొన్న తరువాత భోజన విరామం అనంతరం నెల్లిమర్ల మండలం కొండవెలగాడకు హెలీకాప్టర్‌లో బయలుదేరతారు. కొండవెలగాడలో నిర్మించిన వెయిట్‌లిఫ్టింగ్ హాల్‌ను మధ్యాహ్నం 3.15కు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. క్రీడాకారులను ఉద్ధేశించి మాట్లాడిన అనంతరం నాలుగు గంటలకు కొండవెలగాడ నుంచి విశాఖకు బయలుదేరుతారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్టమ్రంత్రులు మృణాళిని, చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
విస్తతృ ఏర్పాట్లలో అధికారులు
ముఖ్యమంత్రి పర్యటన కోసం జిల్లా యంత్రాంగం అటు బొండపల్లి, ఇటు కొండవెలగాడలో విస్తృత ఏర్పాట్లు చేసింది. తొలుత నిర్ణయించిన ప్రకారం మొదట ముఖ్యమంత్రి కొండవెలగాడకు వచ్చి ఆ తరువాత బొండపల్లి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. కానీ శుక్రవారం ఉదయం మారిన సిఎం పర్యటన షెడ్యూల్ జిల్లాయంత్రాంగానికి అందటంతో ఆ మేరకు ఏర్పాట్లలో మార్పు చేసారు. బొండపల్లి, కొండవెలగాడలో సిఎం హెలీకాప్టర్ కోసం ప్రత్యేకంగా హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేసారు. బొండపల్లిలో జన్మభూమి బహిరంగ సభ వేదిక ఏర్పాటు ఇంచుమించు పూర్తికాగా, కొండవెలగాడలో క్రీడాకారులతో ముఖ్యమంత్రి ఇష్టాగోష్టిగా సమావేశం అయ్యే అవకాశం ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పాల్గొనే బొండపల్లి జన్మభూమి బహిరంగ సభకు గజపతినగరం నియోజకవర్గం నుంచి, కొండవెలగాడలో జరిగే వెయిట్‌లిఫ్టింగ్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి భారీగా జనాలను తరలించేందుకు పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బొండపల్లి, కొండవెలగాడలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఎంఎం నాయక్ పరిశీలించి అధికారులతో సమీక్ష జరిపారు
సిఎం పర్యటనకు భారీ పోలీసు బందోబస్తు
కాగా శనివారం జరిగే ముఖ్యమంత్రి పర్యటన కోసం బొండపల్లి, కొండవెలగాడలో జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి బొండపల్లి, కొండవెలగాడల పర్యటన బందోబస్తు కోసం ఒక అదనపు ఎస్పీ, ఒక ఎఎస్పీ, 10మంది డిఎస్పీలు, 37మంది సిఐలను నియమించారు. అదే విధంగా ఇద్దరు ఆర్‌ఐలు, 94మంది ఎస్సైలు, నలుగురు ఆర్‌ఎస్సైలు, 154మంది ఎఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లకు డ్యూటీలు వేసారు. 745మంది కానిస్టేబుళ్లు, 72మంది మహిళా కానిస్టేబుళ్లు సిఎం బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. విశాఖ రీజియన్ ఐజి, విశాఖ డిఐజి, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో సిఎం బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి.