జాతీయ వార్తలు

సీఎం పదవి ముఖ్యం కాదు:కుమారస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: తనకు సీఎం పదవి ముఖ్యం కాదని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఆయన విశ్వాస పరీక్షకు సంబంధించి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ తొందరెందుకు సీఎం పదవి మీరే తీసుకోండని ఆయన బీజేపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. తాను పదవి కోసం కాంగ్రెస్ వారి వద్దకు కూడా వెళ్లలేదని అన్నారు. తన కూటమి ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇచ్చారని అది ఎవరి సొమ్ము అని ప్రశ్నించారు. ప్రతి సంకీర్ణ ప్రభుత్వంలోనూ విభేదాలు సహజమని, సంకీర్ణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ కుట్ర పన్నుతుందని అన్నారు. కాగా బీజేపీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ సీఎంకు ఇదే చివరిగా ప్రసంగించే అవకాశం అని వ్యాఖ్యానించారు.