కరీంనగర్

కరవుతో అల్లాడుతున్నా కనికరం చూపని సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మహా ఒప్పందంతో 50 మీటర్ల ఎత్తు కోల్పోతున్నాం
* తెలంగాణ సమరయోధులకు ప్రశంసా పత్రాలు అందించాలి
* సిఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి
జగిత్యాల, మార్చి 15: వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు లేక రైతులు తల్లడిల్లుతున్నా కరవు మండలాలను ప్రకటించడం లో సిఎం కెసిఆర్ కనీసం కనికరం చూపించకపోవడం పట్ల సిఎల్పీ ఉపనేత, స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం జగిత్యాలలోని ఇంట్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ శాసనసభపై ప్రజలకు నమ్మకం ఉందని కరవుపై ఆధారాలతో ప్రభుత్వానికి నివేదిస్తే కనీసం మర్యాద పూర్వకంగానైనా పరిశీలిస్తామని చెప్పకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో 57మండలాలకు 40మండలాలను కరవు మండలాలుగా గుర్తించి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందిస్తే కేవలం 19మండలాలనే కరవు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. తిరిగి జిల్లా కలెక్టర్ మరోసారి కూడా 40కరవు మండలాలను గుర్తిస్తూ నివేదిక పంపినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో హైకోర్టు ఆశ్రయించామని, 3వారాల గడవు ఇచ్చిందని ఇప్పటికీ ప్రభుత్వం కరవు మండలాలపై స్పందించక పోవడం విచాకరమన్నారు. మహా ఒప్పందంతో 50మీటర్ల ఎత్తును కోల్పోతున్నామని, మహా ఒప్పందంతో 16లక్షల ఎకరాలకు నీరు అందుతుందని ఎకరానికి రూ. 60వేల చొప్పున భారం పడుతుందని, వ్యవసాయం సాగు చేసినా అంత దిగుబడి రాదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుతో 1800ఎకరాలు ముంపుకు గురవుతుందని దీనికి నష్టపరిహారం చెల్లించి మహరాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సింది పోయి తెలంగాణకు నష్టం చేరుకూరేలా మహా ఒప్పందం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై సమిథలైన వారికి తెలంగాణ సమర యోధులుగా ప్రశంసా పత్రాలు అందించాలని, ఇప్పటికీ రైల్వే కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ క్రింద రూ. 25వేల కోట్లు కేటాయిస్తే 10వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మిగితా 15వేల కోట్లు ఖర్చు చేయలేదన్నారు. ఈ 15వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీలకు 3ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించరాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు అర్థం లేకుండాపోయిందన్నారు. వ్యక్తిగత ఆరోపణలు ఎప్పుడూ చేయలేదని, ప్రజాహిత ఆరోపణలే కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు. సిఎం కెసిఆర్ వేములవాడ రాజరాజేశ్వరస్వామి సాక్షిగా మిడ్ మానేరు ముంపు బాధితులకు రూ. 5లక్షల 4వేల ఖర్చుతో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన సిఎం ప్రకటనలకే విలువ లేకుండా పోయిందన్నారు. కెజి టూ పిజి విద్య రెండేళ్లు గడుస్తున్నా కాగితాలకే పరిమితమైందన్నారు. విద్యా హక్కు చట్టం 25శాతం విధిగా ఎస్సీ, ఎస్టీ, బిసి అల్పసంఖ్యాక వర్గాలకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో తాటిపర్తి దేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బండ శంకర్, దామోదర్‌రావు, ముస్కు ఎల్లారెడ్డి, గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.