తెలంగాణ

కోటి ఎకరాలకు నీరు అందిస్తాం: కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్ని సమస్యలు, సవాళ్లు ఎదురైనా తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించి తీరుతామని సిఎం కెసిఆర్ గురువారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. జల విధానం, సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ఆయన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సమైక్య పాలనలో తెలంగాణను నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గోదావరి నదిలో 954 క్యూసెక్కుల నీటిని వాడుకుని తీరుతామన్నారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి పథకాలకు 25వేల కోట్ల రూపాయలు కేటాయించామని, వచ్చే ఏడాది మరో 5వేల కోట్లను పెంచుతామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించినందుకు ఎపి సిఎం చంద్రబాబును ఆయన అభినందించారు. పోలవరం కంటే సముద్రంలో గోదావరి వృథాగా కలిసే చోట చిన్న చిన్న ప్రాజెక్టులను ఎపిలో నిర్మించుకోవాలని, నీటి వివాదాలకు స్వస్తి పలికితే ఇరు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందన్నారు. ఇందుకు తానే చొరవ చూపుతానన్నారు. చిరకాలంగా దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందని, మహారాష్టల్రో నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నీటి కొరత ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌లో నీటి ఎద్దడిని నివారించేందుకు శివారు ప్రాంతాల్లో తగినన్ని జలాశయాలను నిర్మిస్తామన్నారు.