బిజినెస్

మహీంద్ర బయో-సిఎన్‌జి ప్లాంట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 2: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర శనివారం ఇక్కడ ఓ బయో-సిఎన్‌జి ప్లాంట్‌ను ప్రారంభించింది. ఇక్కడున్న మహీంద్ర వరల్డ్ సిటీ వద్ద కార్బన్ న్యూట్రల్ ఈకోసిస్టమ్ ఏర్పాటు కోసమే ఈ ప్లాంట్. వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలోగల ఈ ప్లాంట్‌లో ప్రతిరోజు ఎనిమిది టన్నుల ఆహార, వంటల వ్యర్థాలను 1,000ఎమ్3 ముడి బయోగ్యాస్‌గా మార్చనున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనలో మహీంద్ర అండ్ మహీంద్ర తెలిపింది. అనంతరం దీన్ని 400 కిలోల ప్యూరిఫై సిఎన్‌జి శ్రేణి ఇంధనంగా మార్చనుండగా, ఇది 200 కిలోవాట్ల విద్యుత్ ప్లాంట్ సామర్థ్యానికి సమానమని ఆ ప్రకటనలో మహీంద్ర అండ్ మహీంద్ర స్పష్టం చేసింది.