అంతర్జాతీయం

సహకరిస్తే.. తగ్గించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొగ్గు వినియోగంపై అభివృద్ధి చెందిన దేశాలకు భారత్ స్పష్టీకరణ
ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు మళ్లుతామని వెల్లడి

లే బౌర్గెట్ (ఫ్రాన్స్), డిసెంబర్ 3: అభివృద్ధి చెందిన దేశాలు తమకు తగినన్ని నిధులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడానికి అంగీకరిస్తే ఇకమీదట విద్యుచ్ఛక్తి తయారీకి బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటానని, పర్యావరణ సహితమైన శుద్ధ ఇంధన వనరులవైపు మళ్లుతానని భారత్ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులను అడ్డుకోవడానికి దీర్ఘకాలిక పరిష్కారంగా దశలవారీగా వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరమైన తరుణంలో బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారత్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. పారిస్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి (ఐరాస) వాతావరణ మార్పుల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రతినిధి అజయ్ మాథుర్ మాట్లాడుతూ తమ దేశం వైఖరిని స్పష్టం చేశారు. భారత్ తన విద్యుచ్ఛక్తి అవసరాలను తీర్చుకోవడానికి బొగ్గు వినియోగాన్ని పెంచుకునే తన ప్రణాళికల ద్వారా ఏకాకి అవుతుందనే వార్తలు వెలువడిన నేపథ్యంలో.. సౌర, పవన విద్యుత్ ఉత్పాదనకు తాను తొలి ప్రాధాన్యం ఇస్తానని, తరువాత జల, అణు విద్యుత్ ఉత్పాదనకు ప్రాధాన్యం ఇస్తానని, ఆ తరువాతే కావాల్సిన మిగతా విద్యుత్‌ను బొగ్గు ఆధారంగా ఉత్పత్తి చేస్తానని భారత్ స్పష్టం చేసింది. సౌర, పవన, జల, అణుపదార్థాలు కర్బనేతర వనరులని, అందువల్ల వీటి ద్వారా విద్యుత్ ఉత్పాదనకే తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని, వీటన్నింటి ద్వారా కలిసి ఉత్పత్తి చేసిన విద్యుత్ పోగా, మిగతా కావలసిన విద్యుత్ కోసం మాత్రమే బొగ్గుపై ఆధారపడుతామని అజయ్ మాథుర్ శిఖరాగ్ర సదస్సులో చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశాలు తగినంత ఆర్థిక సాయం చేయడంతో పాటు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తే వేగంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు మళ్లడం ద్వారా బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటానని భారత్ స్పష్టం చేసింది.