యువ

కాఫీ చాలా హాట్ గురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేడిని కనిపెట్టే రెడీసిప్
సాధారణంగా కాఫీని ఆస్వాదిస్తూ తాగేవారు తక్కువే. పేపర్ చదువుతూనో, టీవీ చూస్తూనో...ఇలా ఒక చేత్తో కాఫీ కప్ పట్టుకుని మరో పనిపై ధ్యాస పెట్టేవారే ఎక్కువ. తీరా కాఫీ సిప్ చేయగానే ఆ వేడికి నాలుక చురుక్కుమంటే తట్టుకోలేక చేతిలో కాఫీ కప్‌ను అదాటున వదిలేసేవారూ ఉన్నారు. రెడీ సిప్ ఉంటే ఈ బాధలన్నీ ఉండవన్నమాటే. ఇంతకీ ఏమిటీ రెడీ సిప్? ఇదో ఫుడ్ సేఫ్ ధర్మామీటర్. పైన ఓ ఎల్‌ఇడి లైట్ కూడా ఉంటుంది. దీనిని కాఫీ కప్‌లో ఉంచితే ఎంత వేడిగా ఉందో చెప్పేస్తుంది. ఎల్‌ఇడి లైట్ ఎరుపు రంగులో వెలిగితే చాలా వేడిగా ఉన్నట్టు. నీలం రంగులోకి మారితే మరీ చల్లగా ఉన్నట్టు. ఆకుపచ్చ రంగులో వెలిగితే వేడి తగినంతగా ఉన్నట్టు. మరో విశేషమేమిటంటే- రెడీ సిప్‌లో బిల్టిన్ బ్లూ టూత్ ఏంటెన్నా కూడా ఉంటుంది. దీనిని మీ స్మార్ట్ఫోన్‌కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చన్నమాట. సం బంధిత యాప్ సాయంతో మీకు కావలసిన టెంపరేచర్‌ను సెట్ చేసుకుంటే ఆ వేడికి కాఫీ చల్లారాక మిమ్మల్ని రెడీ సిప్ అలెర్ట్ చేస్తుంది.