సంజీవని
ప్రొద్దున్నే వేడివేడి కాఫీ తాగందే.. బుర్ర
పనిచేయదు. ‘కెఫెన్’ అనే పదార్థం
వొంటికి అంత మంచిది కాదనీ.. అదే
పనిగా కాఫీ తాగేస్తూంటే -లేనిపోని
సమస్యలొస్తాయన్న మాట పక్కనపెట్టి -
ప్రతిరోజూ రెండు మూడు కప్పుల వేడి
కాఫీ తాగటంవల్ల మహిళల్లో ‘హృద్రోగం’
ఛాయలు 19 శాతం కనిపించలేదని
యుఎస్ శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు.
83,076 మంది మహిళలపై జరిపిన
పరిశోధనల ద్వారా ఈ సంగతి
వెల్లడించారు. వీరంతా గతంలో
విపరీతంగా సిగరెట్లు తాగేవారు.. లేదా
అస్సలు తాగని వారై ఉన్నారు. పొగ
పీల్చేవారిలో 3 శాతం.. పీల్చని వారిలో
43 శాతం పురోభివృద్ధి కనిపించినట్టు
తెలిపారు. ఏది ఏమైతేనేం - కాఫీ
తాగటంవల్ల హృద్రోగాన్ని పారద్రోల
వచ్చునన్నమాట.
*
Add new comment