తెలంగాణ

సిఎం జిల్లాలో కోల్డ్‌వార్ ఐఎఎస్ వర్సెస్ టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్థాయా సంఘ సమావేశాన్ని బహిష్కరించిన జడ్పీ వైస్‌చైర్మన్, జడ్పీటిసిలు

సంగారెడ్డి, మార్చి 11: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఐఎఎస్ అధికారి, జడ్పీ సిఇఓ మధ్య కొనసాగుతున్న కోల్డ్‌వార్ బహిర్గతమై పరిస్థితిని తీవ్రస్థాయికి తీసుకువెళ్తోంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న జడ్పీ స్థాయా సంఘ సమావేశాలకు మీడియాను అనుమతించకుండా సిఇఓ వర్షిణి ఆంక్షలు విధించడాన్ని జడ్పీ చైర్‌పర్సన్ సహా సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా తన వైఖరిని మార్చుకోకుండా మొండిగా వ్యవహరించడంపై ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొదటి రోజు బుధవారం విలేఖరులను స్థాయా సంఘ సమావేశాలకు అనుమతించకపోవడంతో జర్నలిస్టు సంఘాలు కలెక్టర్ రొనాల్డ్ రాస్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు దృష్టికి తీసుకువెళ్లి సిఇఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. విచారణ చేస్తామని మంత్రి హామీ ఇచ్చిన మరుసటి రోజు కూడా సిఇఓ అదే తీరును అనుసరించారు. సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేసి సిఇఓపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన చైర్‌పర్సన్ రాజమణి విలేఖరులను అనుమతించాలని ఆదేశించడంతో మధ్యాహ్నం అనాసక్తిగానే విలేఖరులను లోపలకు అనుమతించారు. శుక్రవారం జడ్పీ వైస్‌చైర్మన్ అధ్యక్షతన నిర్వహించాల్సిన 3వ స్థాయా సంఘ సమావేశానికి ముందుగానే శుక్రవారం రాత్రి సిఇఓ తన పేరుతో మీడియాను అనుమతించడం లేదని సాయంత్రం సమావేశంలో చర్చించిన విషయాలను ప్రెస్‌మీట్ ద్వారా వెల్లడిస్తామంటూ సమాచార శాఖ ద్వారా ప్రతులను పంపించారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు స్థాయా సంఘ సమావేశాన్ని వైస్ చైర్మన్, సంఘానికి అధ్యక్షతన వహించిన సారయ్య మీడియాను అనుమతించాలని సూచించినా సిఇఓ ససేమిరా అంటూ నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన వైస్‌చైర్మన్ సహా పలువురు జడ్పీటిసి సభ్యులు స్థాయా సంఘ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు. సభ్యులు ఆమోదించకపోయినా కలెక్టర్ ద్వారా ఆయా ప్రతిపాదనలకు అనుమతులు తీసుకుంటానంటూ తమను అగౌరపరిచే విధంగా సిఇఓ మాట్లాడారని సారయ్య ఆవేదన వ్యక్తం చేసారు. మీడియాతో కలిసి జిల్లా పరిషత్ ప్రధాన ముఖ ద్వారం వద్ద పలువురు జడ్పీటిసి సభ్యులు ధర్నాకు దిగి సిఇఓకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఐఎఎస్ అధికారి వస్తే నిష్పక్షపాతంగా పనులు కొనసాగుతాయని భావిస్తే ఆమె వ్యవహార శైలి అందుకు వ్యతిరేకంగా ఉండటం బాధ కలిగిస్తోందని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. అధికార పార్టీకి చెందిన జడ్పీ వైస్ చైర్మన్‌ను అయిన తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన సిఇఓపై తగిన చర్యలు తీసుకునేందుకు మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని.. ఎప్పటిలాగే మీడియాను స్థాయా సంఘ సమావేశాలకు అనుతించే వరకు తాము రాజీలేని పోరాటం చేస్తామని సారయ్య మద్దతు పలికారు. కాగా జడ్పీటిసిలు, మీడియా ప్రతినిధులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న జడ్పీ చైర్ పర్సన్ రాజమణి ఫోన్ ద్వారా స్పందించి సోమవారం నాటికి సిఇఓ వ్యవహరిస్తున్న తీరుపై ఓ పరిష్కారం తీసుకువస్తామని ఆందోళన విరమించాలని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.