రాష్ట్రీయం

చలి పెరుగుతుంది..జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 28: చలి తీవ్రత దేశ ప్రజలను కుదిపేస్తోంది. ఉత్తరాదిలో చలి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ చలి సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. మరో వారం రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు తెలియచేస్తున్నారు. ఉత్తరాదిలోని తూర్పు రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, యుపి, తూర్పు మధ్య ప్రదేశ్, చత్తీస్‌గడ్, బీహార్‌ల్లో ఐదు నుంచి తొమ్మిది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మూడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం రోజుల్లో ఈ ఉష్ణోగ్రత మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఒడిశాలో చలి గాలులు బలంగా వీస్తున్నాయి. ఇక్కడ 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీని ప్రభావం వలన విశాఖ ఏజెన్సీలోని రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో 10 నుంచి 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది. విశాఖలో ప్రస్తుతం 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.