శ్రీకాకుళం

వసూళ్ళు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: కొద్దిరోజుల క్రితం ఉన్నతాధికారి ఒకరు తన కారుతో రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఢీ కొట్టి గాయపర్చడమే కాకుండా ఆ కేసు నుండి బయట పడేందుకు ఒప్పుకున్న నగదు మొత్తాన్ని ఇంజినీరింగ్ అధికారులపై రుద్ధడం హౌసింగ్ శాఖలో కలకలంరేపింది. అసలే నిధులేవ్..ఆపై పనులేవ్..జిల్లా అంతటా 43 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, పది మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నారు. వీరందరికీ గత కొన్నాళ్ళుగా బిల్లులు చెల్లింపులు, వసూళ్ళు ఏమీ లేవ్! అంతా ప్రభుత్వ పథకాల ప్రచారకర్తలుగానే విధులు వెలగబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ మండల ఇంజనీరు రెండు వేల రూపాయలు ఇవ్వాలంటూ ఓ ఉన్నతాధికారి చేసిన శాసనం హౌసింగ్‌శాఖను అతలాకుతలం చేస్తోంది! డి.ఇ.ఇ.లు, అసిస్టెంట్ ఇంజనీర్లు మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..ఈనెల 10వ తేదీన విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వస్తూ జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి కారు ఎచ్చెర్ల మండలం పోలీస్ క్వార్టర్స్ సమీపాన రోడ్డుదాటుతున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ గాయాలపాలుకావడంతో స్థానికులు అసుపత్రికి చేర్చారు. విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన మహిళ తన బందువుల ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేశారు. అయితే 70వేల రూపాయలు గాయపడిన మహిళకు వైద్య ఖర్చుల నిమిత్తం ముట్టజెప్పేలా హౌసింగ్ ఉన్నతాధికారి రాజీ కుదుర్చుకున్నారు. ఆ మేరకు కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్న తరుణంలో మహిళకు నగదు చెల్లించేందుకు ఆ శాఖలో విధులు నిర్వహిస్తున్న మండల ఇంజనీర్లు నుంచి ఒక్కోక్కరి నుంచి రెండు వేల రూపాయలు విరాళాలు సేకరించేందుకు ప్రత్యేక సమీక్షా సమావేశాలు వరుసగా జరిగినట్లు ఆ శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఈ సమావేశాల్లో ప్రమాదానికి చెల్లించాల్సిన పెనాల్టీకి మీరంతా సహకరించాలన్న హుకుం జారీ చేయటంతో పాటు, ఇప్పటి వరకు ఇంతవరకూ తనకు ఎప్పుడూ ఎవరూ చిల్లిగవ్వకూడా ఇవ్వలేదన్న వాస్తవానికి దూరమైన విషయం చెప్పడంతో హాజరైన మండల ఇంజనీర్లు అంతా అవాక్కయ్యారు. ప్రతీ నెలా బిల్లులు చెల్లింపులు లేనప్పటికీ, పనులకు నిధులు రానప్పటికీ మండలాల నుంచి కార్యాలయ ఖర్చులకు చెల్లించే వేలాది రూపాయలు ఆ అధికారి అందలేదని చెప్పడంతో ఎ.ఇ.లంతా డి.ఇ.ఇ.లపై ఆగ్రహించడం ప్రారంభించారు. కాని - ప్రమాదం చేసిన అధికారి రాజీ రుసుం కోసం మాత్రం ఎ.ఇ.లంతా సహకరించక తప్పలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన నుంచి ఎటువంటి నిర్మాణాలు సాగకపోవడంతో నానా అవస్థలు ఎదుర్కొంటున్న హౌసింగ్ అధికారులను ఈ భారంతో మరింత గోల చేస్తున్నారు. ఆ శాఖలో ఈ చర్చ హాట్..హాట్ టాపిక్‌గా మారింది. ప్రమాదం బాస్ చేయడం... బారం తమపై నెట్టడం ఎంతవరకు సమంజసమని వారంతా బహిరంగంగానే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు వసూళ్లను వ్యతిరేకిస్తున్నారని సిబ్బంది ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించగా వారి వివరాలు ఇవ్వాలని ఆయన చిందులేస్తున్నట్లు కార్యాలయం సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. ఇటువంటి ఉన్నతాధికారిని తామెప్పుడూ చూడలేదని సిబ్బంది అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇలాఉంటే మండల ఇంజనీర్ల కలెక్షన్‌పై హౌసింగ్‌శాఖ ఉన్నతాధికారిని ‘ఆంధ్రభూమి’ ప్రశ్నించగా అటువంటి వసూళ్ళు ఏమీ చేయలేదని, జిల్లాలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ ఒక్కరి నుంచి చిల్లిగవ్వ తీసుకోలేదంటూ స్పష్టం చేసారు.

ఆడపిల్లల రక్షణే ధ్యేయం కావాలి
శ్రీకాకుళం, డిసెంబర్ 22: ఆడపిల్లల రక్షణే మన ధ్యేయం కావాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక వరం రెసిడెన్సీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భస్థ పిండ లింగ నిర్థారణ చట్టంపై న్యాయాధికారులు, వివిధ శాఖల అధికారులకు నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
అనాధిగా పితృస్వామ్య సమాజంగా కొనసాగుతూ మగ బిడ్డలపై మమకారం అధికమవుతుందన్నారు. దీంతో ఆడపిల్లల భ్రూణ హత్యలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక సామాజిక రుగ్మతగా రూపుదిద్దుకుందని చెప్పారు. ప్రపంచంలో మరే దేశంలో లేని ఇటువంటి పరిస్థితికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వయోజనుల జనాభా నిష్పత్తిలో మహిళా నిష్పత్తి బాగుందని, ఆరు సంవత్సరాల వయస్సులోపు మాత్రం ప్రతి వెయ్యిమందికి 954 మంది ఆడపిల్లలు ఉంటున్నారని, ఇది ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు. మాతృత్వం తల్లికి వరమని, గర్భంతో ఉన్న తల్లులు ఆడపిల్ల పేరుతో గర్భస్రావాలకు ఉపక్రమించరాదని హితవుపలికారు. జిల్లాలో ఒక్క ఆడపిల్ల భ్రూణ హత్య జరుగకుండా ప్రతి వైద్యుడు కంకణబద్ధుడై చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ అన్నపూర్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్.శ్యామల, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ రవి కిరణ్ శర్మ, అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.శారద, డియల్‌వో డాక్టర్ జి.రత్నకుమారి, డిఐవో బి.జగన్నాథం, డాక్టర్ మెండ ప్రవీణ్ కె.అమ్మన్నాయుడు పాల్గొన్నారు.