రంగారెడ్డి

రోడ్ ప్రమాదాలపై పూర్తి పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 22: రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై పూర్తిగా పరిశీలించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేటులో రోడ్డు భద్రత కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలు, వాటిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే సమయాల్లో వివిధ శాఖల అధికారులు నిర్వహించే విధులపై చర్చించారు. రానున్న పది రోజులపాటు జరిగే రోడ్డు ప్రమాదాలపై రవాణా శాఖ అధికారులతో పాటు ఆర్ అండ్ బి అధికారులు ప్రమాదాలను పూర్తిగా పరిశీలించి నివేదికలు ఇవ్వాలని తెలిపారు. రవాణా శాఖ అధికారులు రోడ్ల ప్రమాదాలపై కీలకమైన అంశాలను సులువైన విధానంలో సాఫ్ట్‌వేర్ ద్వారా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ముందుగా చికిత్స అందించాలనే విషయాన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు సూచించాలని జిల్లా వైద్య శాఖ అధికారాని ఆదేశించారు. జిల్లా కలెక్టరేటులో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించేందుకు సర్క్యులర్‌ను జారీచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకే డ్రైవర్ ఒకటి కన్నా మించి చేసే రోడ్ల ప్రమాదాలపై సమాచారం తయారు చేసుకోవాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని కలెక్టరు అన్నారు.రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌పై అతివేగంతో నడిపే వాహనదారుల లైసెన్సులు రద్దు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాలు జనవరి 11 నుండి 16 వరకు జరుగనున్నట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం ఓవర్‌లోడ్ కేసుల నమోదు తగ్గినట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి భానుప్రకాష్, సిపిఓ శర్మ, సైబరాబాద్ అడిషనల్ సిపి దివ్య చరణ్‌రావు, చేవెళ్ళ డిఎస్‌పి రంగారెడ్డి, ఆర్ అండ్ బి, ఎన్‌హెచ్‌ఎఐ ఆర్టీసి, ట్రాన్స్‌ఫోర్టు అధికారులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాలల విద్యార్థులకు రవాణా సౌకర్యం
జిల్లాలో ఉన్న 14 ఆదర్శ పాఠశాలలకు దాదాపు 20 కిలోమీటర్ల నుండి కూడా పిల్లలు వస్తున్నారని వారికి సరైన బస్సు సౌకర్యం కలిగించవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అనా ను. మంగళవారం కలెక్టరేట్‌లో గ్రామీణ మండలాల్లో ఆర్టీసి డిపో మేనేజర్లు, ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమన్వయ సమావేశం జరిగింది. జిల్లాలోని 14 ఆదర్శ పాఠశాలల్లో 3,884 మంది విద్యార్థులున్నారని, ఇందులో 2075 మంది బాలలు, 1809 మంది బాలికలు చదువుతున్నారని కలెక్టర్ అన్నారు. వీరిలో 90 శాతంపైగా విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఆర్టీసి బస్సులపైనే ఆధారపడుతున్నారని అన్నారు. వీలైన చోట బస్సు సమయాలు సవరించి విద్యార్థులకు అనుకూలంగా మార్చాలని ఆయన ఆర్టీసి అధికారులకు సూచించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి వీటిపై సమగ్ర నివేదికను పాఠశాలల వారీగా అందజేయాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ వచ్చే మంగళవారం సంబంధిత ఇఇలతో సమావేశం ర్పాటుచేసి మరుగుదూడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిఇఓను ఆదేశించారు. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించి అత్యధికంగా ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు వీలుగా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఆమె సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల వైపు వస్తున్న బస్సుల సమయాలు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను సవివరంగా డిపో మేనేజర్లకు తెలియజేశారు. బంట్వారం, కుల్కచర్ల, మర్పల్లి ఆదర్శ పాఠశాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొన్ని మారుమూల గ్రామాల నుండి వస్తున్న విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. డిఇఓ రమేష్, రంగారెడ్డి ఆర్టీసి డివిజినల్ మేనేజర్ కవిత, తాండూరు, వికారాబాద్, పరిగి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం డిపోల మేనేజర్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.